తండ్రైన యువరాజ్‌ సింగ్‌.. | Former Cricketer Yuvraj SIngh-Hazel Keech Blessed With Baby Boy | Sakshi
Sakshi News home page

Yuvraj Singh: తండ్రైన యువరాజ్‌ సింగ్‌.. దేవుడికి కృతజ్ఞతలు

Published Wed, Jan 26 2022 7:46 AM | Last Updated on Wed, Jan 26 2022 8:41 AM

Former Cricketer Yuvraj SIngh-Hazel Keech Blessed With Baby Boy - Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్  తండ్రయ్యాడు. తన భార్య హజెల్ కీచ్ మంగళవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని యువరాజ్‌ తన ట్విటర్‌లో స్వయంగా వెల్లడించాడు."నా అభిమానులకు, స్నేహితులకు, కుటుంబసభ్యులకు ఒక శుభవార్త. మాకు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఇంత ఆనందాన్ని ఇచ్చిన దేవుడికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సందర్భంగా మా గోప్యతకు భంగం కలిగించకూడదని కోరుకుంటున్నాం'' అంటూ ట్వీట్‌ చేశాడు.

చదవండి: యువరాజ్‌ సింగ్‌ గురించి మనకు తెలియని విశేషాలు

కాగా 2016లో యువరాజ్‌ సింగ్‌, హజెల్‌ కీచ్‌ల వివాహమైన సంగతి తెలిసిందే. ఇక 19 ఏ‍ళ్ల కెరీర్‌లో యువరాజ్‌ టీమిండియా తరపున 40 టెస్టుల్లో 3 సెంచరీలు.. 11 అర్థసెంచరీల సాయంతో 1900 పరుగులు.. 10 వికెట్లు తీశాడు. ఇక 304 వన్డేల్లో 14 సెంచరీలు.. 52 హాఫ్‌సెంచరీలతో కలిపి 8701 పరుగులతో పాటు 111 వికెట్లు పడగొట్టాడు. ఇక 58 టి20ల్లో 8 అర్థసెంచరీల సాయంతో 1177 పరుగులు చేసిన యువీ బౌలింగ్‌లో 29 వికెట్లు పడగొట్టాడు. 2007 టి20 ప్రపంచకప్‌, 2011 వన్డే వరల్డ్‌కప్‌ టీమిండియా గెలవడంలో యువీ పాత్ర మరువలేనిది.

చదవండి: Legends League Cricket 2022: వరుసగా రెండో ఓటమి.. వసీం జాఫర్‌ మాత్రం తగ్గేదే లే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement