Yuvraj Singh Funny Reaction On Wife Heartwarming Post About Their Son, Deets Inside - Sakshi
Sakshi News home page

Yuvraj Singh: 'ఎవరీ బుడ్డోడు'.. కన్న కొడుకును గుర్తుపట్టలేకపోయిన యువీ!

Published Wed, Jul 27 2022 8:47 AM | Last Updated on Wed, Jul 27 2022 9:52 AM

Yuvraj Singh Comes Hilarious Reaction Wife Heartwarming Post About-Son - Sakshi

టీమిండియా మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్ కన్న కొడుకునే గుర్తుపట్టలేకపోయాడు. అదేంటి అని ఆశ్యర్యపోకండి. కేవలం సరదా కోసం మాత్రమే అలా చెప్పాం. విషయంలోకి వెళితే యువరాజ్‌, హాజెల్‌ కీచ్‌ 2016 నవంబర్‌ 30న పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో ఈ దంపతుల ఇంట్లోకి పండంటి మగబిడ్డ అడుగుపెట్టాడు. తన కుమారుడికి ఆరు నెలలు పూర్తవ్వడంతో యువీ భార్య హాజెల్‌కీచ్‌ కొడుకు ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకుంది. 

''అప్పుడే నా బంగారానికి ఆరు నెలలు వచ్చేశాయి. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం ఆనందంగా ఉంది. నీ చేత అమ్మగా పిలిపించుకోవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. హ్యాపీ సిక్స్‌ మంత్స్‌ ఓరియెన్‌'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. హాజెల్‌కీచ్‌ షేర్‌ చేసిన ఫోటోపై చాలా మంది సెలబ్రిటీలు స్పందించారు. సానియా మీర్జా మొదలు నీతి మోహన్‌, యాక్టర్లు సత్యజిత్‌ దూబే, సాగరికా గాత్కే,  క్రికెటర్‌​ బెన్‌​ కటింగ్‌ భార్య ఎరిన్‌ హాలండ్‌లు ఎమోజీలతో రిప్లై ఇచ్చారు. అయితే యువరాజ్‌ మాత్రం ''ఎవరీ బుడ్డోడు.. ఎవరి కొడుకు ఇతను ''అంటూ ఫన్నీగా కాప్షన్‌ పెట్టాడు. 

ఇక యువరాజ్‌ టీమిండియా తరపున గ్రేటెస్ట్‌ ఆల్‌రౌండర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. 15 ఏళ్ల పాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన యువరాజ్‌ 2007, 2011 ప్రపంచకప్‌లు గెలవడంలో కీలకపాత్ర పోషించారు. అంతేకాదు 2007 టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి యువరాజ్‌ చరిత్ర సృష్టించాడు. కాగా జూన్‌ 10, 2019లో యువరాజ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.

చదవండి: PAK vs SL: లంక క్రికెటర్‌తో పవాద్‌ ఆలం వైరం.. ఇలా కూడా గొడవ పడొచ్చా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement