టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ భార్య, బాలీవుడ్ నటి హజెల్ కీచ్ కీలక నిర్ణయం తీసుకుంది. కొంతకాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని గురువారం నాడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు వెల్లడించింది. స్నేహితులు, బంధుమిత్రులెవరూ కూడా తనకు మెసేజ్ చేయొద్దని కోరింది.
"నేను, నా ఫోన్ బ్రేక్ తీసుకుంటున్నాం.. ఈ విషయం మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుందని నాకు తెలుసు, కానీ తప్పదు! పూర్తిగా ఒకరిపై ఒకరం ఆధారపడటం అలవాటైన మనకు ఒంటరిగా ఎలా బతికేవాళ్లమో గుర్తుకురావాలంటే ఇలాంటి బ్రేక్స్ తీసుకోవాల్సిందే.. కాబట్టి సోషల్ మీడియాకు నేను వీడ్కోలు పలుకుతున్నాను. కానీ ఇది తాత్కాలికమే. మళ్లీ సోషల్ మీడియాలో మీ అందరినీ పలకరిస్తాను. అయితే అది అంత తొందరగా కాదులెండి. కనుక ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే మెసేజ్‌కు బదులు ఫోన్ చేయండి" అంటూ ఓ లేఖను షేర్ చేసింది. దీంతో కొందరు అభిమానులు ఆమె తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తుండగా మరికొందరు మాత్రం ఆమె బాగానే ఉంది కదా! అంటూ ఆందోళన చెందుతున్నారు.
ఎన్నో కమర్షియల్ యాడ్స్‌లో నటించిన హజెల్ కీచ్ 2007లో తమిళ చిత్రం 'బిల్లా'లో ఓ ఐటం సాంగ్‌లో ఆడిపాడింది. సల్మాన్ ఖాన్ 'బాడీగార్డ్'లోనూ ఓ పాత్రలో నటించింది. 'మాక్సిమమ్' చిత్రంలో 'అ అంటే అమలాపురం..' పాటకు చిందేసింది. కాగా హజెల్ క్రికెటర్ 2011లో తన ఫ్రెండ్ బర్త్‌డేపార్టీలో యువరాజ్ సింగ్‌ను కలిసింది. వీళ్లిద్దరూ 2014లో స్నేహితులయ్యారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడంతో చండీగఢ్‌లో 2016 నవంబర్ 30న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.
చదవండి: సల్మాన్‌ఖాన్ కాదండీ.. ఇంతకీ ఎవరండీ?
Comments
Please login to add a commentAdd a comment