మరో నటితో యువరాజ్ డేటింగ్! | Yuvraj Singh Dating Bodyguard Actress Hazel Keech: Reports | Sakshi
Sakshi News home page

మరో నటితో యువరాజ్ డేటింగ్!

Published Mon, Sep 7 2015 8:12 PM | Last Updated on Sun, Sep 3 2017 8:56 AM

మరో నటితో యువరాజ్ డేటింగ్!

మరో నటితో యువరాజ్ డేటింగ్!

భారత డాషింగ్ ఆల్రౌండర్ యవరాజ్ సింగ్ ప్రియురాళ్ల జాబితా కాస్త పెద్దదే..! గతంలో కిమ్ శర్మ, దీపికా పదుకోన్ తదితర బాలీవుడ్ తారలతో యువీ ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ జాబితాలో కొత్త నటి పేరు చేరింది. బ్రిటీష్ మోడల్, నటి హజెల్ కీచ్తో యువీ డేటింగ్ చేస్తున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

యువీ.. హజెల్తో కలసి ఇటీవల లండన్కు హాలిడే ట్రిప్ వేసినట్టు సమాచారం. లండన్ నుంచి ఇద్దరూ కలిసే భారత్కు తిరిగొచ్చారట. 2011 ప్రపంచ కప్లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువీ ఇటీవల జట్టుకు దూరమైనా..  ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికాడు. ఇక హజెల్ విషయానికొస్తే హిందీ చిత్రం బాడీగార్డ్లో నటించింది. సుజుకి యాడ్లో మెరిసిన ఈ అమ్మడు కొన్ని దక్షిణాది చిత్రాల్లోనూ కనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement