పెళ్లి వేళ యువరాజ్‌ చిన్న పొరపాటు | Yuvraj Singh invites PM Narender Modi for his wedding | Sakshi
Sakshi News home page

పెళ్లి వేళ యువరాజ్‌ చిన్న పొరపాటు

Published Thu, Nov 24 2016 6:21 PM | Last Updated on Fri, Aug 24 2018 2:20 PM

పెళ్లి వేళ యువరాజ్‌ చిన్న పొరపాటు - Sakshi

పెళ్లి వేళ యువరాజ్‌ చిన్న పొరపాటు

న్యూఢిల్లీ: మరో వారంలో ఓ ఇంటివాడు కాబోతున్న టీమిండియా క్రికెట్‌ ప్రముఖ ఆటగాడు యువరాజ్ సింగ్ పెళ్లి వేళ చిన్న పొరపాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పేరును పెళ్లి ఆహ్వాన పత్రికపై తప్పుగా ప్రచురించడాన్ని గుర్తించలేకపోయారు. ప్రధాని నరేంద్రమోదీ అని కాకుండా ప్రధాని (నరేందర్‌ మోదీ) అంటూ అక్షర దోషంతో ఉన్న ఆహ్వాన పత్రికతో ఆయన పార్లమెంటు వద్ద కనిపించారు. అటుగా వెళుతున్న యువీని ఆయన చేతిలోని పెళ్లి కార్డును చూసిన విలేకర్లు వెంటనే తమ చేతుల్లోని కెమెరాలకు పని చెప్పగా ఆ కార్డుపై ప్రధాని మోదీ పేరు తప్పుగా ఉన్నట్లు గుర్తించి ఉంటారు.

అయితే, వీరేందర్‌ సెహ్వాగ్‌తో కలిసి సహవాసం చేసిన యువీపై ఆ పేరు ప్రభావం పడి వీరేందర్‌ మాదిరిగా నరేందర్‌ అని రాసి ఉంటాడేమో అని కొందరు భావిస్తున్నారు. అయినా పెళ్లంటే హడావుడి బిజీ బిజీగా ఉంటారు. ఈ వేళలో ఏ అంశంపైనా కుదురుగా ఉండలేరు.. దేని గురించి పెద్దగా పట్టించుకునే తీరిక ఉండదు. ఇలాంటి సమయాల్లోని చిన్నచిన్న పొరపాట్లు జరగడం సహజమేలే అని మన యువీ ఫ్యాన్స్‌ అంటున్నారు. హాలీవుడ్ నటి, మోడల్‌ హజల్కీచ్తో యువీ ఈ నెల 30న ఏడడుగులు వేయబోతున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన వివాహాని దేశంలోని అగ్రనాయకులను సెలబ్రిటీలను స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement