కాబోయే భార్యతో యువరాజ్‌ షికార్లు | Yuvraj Singh Hazel Keech pre-wedding dinner | Sakshi
Sakshi News home page

కాబోయే భార్యతో యువరాజ్‌ షికార్లు

Published Fri, Nov 11 2016 11:08 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM

కాబోయే భార్యతో యువరాజ్‌ షికార్లు

కాబోయే భార్యతో యువరాజ్‌ షికార్లు

న్యూఢిల్లీ‌: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న టీమిండియా సీనియర్‌ ఆల్‌ రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌, తనకు కాబోయే భార్య హాజల్‌ కీచ్‌తో ప్రివెడ్డింగ్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తున్నాడు. బుధవారం రాత్రి సన్నిహితులకు స్పెషల్‌ డిన్నర్‌ ఇచ్చారు. సోనమ్‌ కపూర్‌ సోదరి రియా కపూర్‌, డిజైనర్‌-నటి పెర్నియా ఖురేషీ తదితరులు ఈ విందుకు హాజరయ్యారు.

యువీ-కీచల్‌ హోటల్‌ నుంచి బయటకు వస్తూ మీడియా కెమెరా కంట పడ్డారు. నలుపు రంగు డ్రెస్‌, నీలం రంగు జాకెట్‌ ధరించిన హాజల్‌ కీచ్‌.. యువీ చేతిలో చేయి వేసి నడుస్తూ బయటకు వస్తున్న ఫొటోలు మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. యువరాజ్‌ నల్లరంగు టీషర్ట్‌, తెలుగు రంగు పాంట్‌ దుస్తులు ధరించి తలకు హెయిర్‌ బాండ్‌ పెట్టుకున్నాడు. ఇద్దరు చేతిలో చేయి వేసుకుని ఆనందంగా హోటల్‌ నుంచి బయటకు రావడాన్ని ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ ఫొటో గ్రాఫర్‌ వారిందర్‌ చావ్లా క్లిక్‌ మనిపించాడు.

నవంబర్‌ 30న చండీగఢ్‌లో సిక్కు సంప్రదాయంలో యువీ- హాజల్‌ కీచ్‌ పెళ్లి సిక్కు సంప్రదాయంలో జరగనుంది. డిసెంబర్‌ 2న గోవాలో హిందూ సంప్రదాయంలో పెళ్లి జరుగుతుందని సమాచారం. ఢిల్లీలో ఘనంగా వివాహ విందు ఇవ్వనున్నారు. సినిమా, క్రీడా, రాజకీయ ప్రముఖులు  రిసెస్షన్‌ కు రానున్నారు. దక్షిణ ఢిల్లీలోని ఛత్తర్ పూర్ లో ఉన్న ఫాంహౌస్ లో సంగీత్‌ కార్యక్రమం నిర్వహించనున్నారు. పెళ్లి ఏర్పాట్లు ఇప్పటికే మొదలవడంతో యువీ ఇంట పెళ్లి సందడి మొదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement