యువీని భయపెట్టే బౌలర్‌ ఎవరో తెలుసా? | Yuvraj Singh reveals name of the only English bowler he could not beat during his illustrious career | Sakshi
Sakshi News home page

యువీని భయపెట్టే బౌలర్‌ ఎవరో తెలుసా?

Published Wed, Apr 12 2017 6:33 PM | Last Updated on Tue, Sep 5 2017 8:36 AM

యువీని భయపెట్టే బౌలర్‌ ఎవరో తెలుసా?

యువీని భయపెట్టే బౌలర్‌ ఎవరో తెలుసా?

న్యూఢిల్లీ: టీమిండియా బ్యాట్స్‌ మన్‌ యువరాజ్‌ సింగ్‌ క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి జట్టు బౌలర్లు వణుకుతారు. అతడికి బౌలింగ్‌ చేయడానికి తటపటాయిస్తారు. ముఖ్యంగా ఇంగ్లీషు బౌలర్లు యువీ అంటే హడలిపోతారు. బౌండరీ, సిక్సర్లతో నిర్దాక్షిణ్యంగా బౌలర్లపై విరుచుకుపడే ఈ ఎడమచేతి బ్యాట్స్‌ మన్‌ తన కెరీర్‌ లో ఎ‍న్నో మెమరబుల్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 2007 ట్వంటీ-20 ప్రపంచకప్‌ లో ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌ లో వరుసగా ఆరు సిక్సర్లు బాదడడం యువీ కెరీర్‌ లో హైలెట్‌ గా నిలిచింది. ప్రస్తుతం ఐపీఎల్‌-10లో హైదరాబాద్‌ తరపున ఆడుతున్న తనదైన శైలిలో బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు.

అయితే తనను భయపెట్టే ఇంగ్లీషు బౌలర్‌ ఒకరు ఉన్నారని యువీ వెల్లడించాడు. గౌరవ్‌ కపూర్‌ షో ‘బ్రేక్‌ ఫాస్ట్‌ విత్‌ చాంపియన్స్‌’లో అతడీ విషయం వెల్లడించాడు. తాను ఎదుర్కొనలేని ఏకైక  ఇంగ్లీషు బౌలర్‌ తన భార్య హజల్‌ కీచ్‌ అని సరదాగా చెప్పాడు. ఎటువంటి  హెచ్చరికలు లేకుండా ఆమె సంధించే బౌన్సర్లకు తన దగ్గర సమాధానం లేదని అన్నాడు. ఆమె బౌలింగ్‌ లో ఆడడం చాలా కష్టమన్నాడు. తనింట్లో ఆమే అంపైర్‌ అని వెల్లడించాడు. ఐపీఎల్‌ లో సత్తా మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకోవాలని యువరాజ్‌ భావిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement