మరోసారి పెళ్లి చేసుకున్న యువరాజ్‌ | What is Yuvraj Singh wife Hazel Keech new name? | Sakshi
Sakshi News home page

మరోసారి పెళ్లి చేసుకున్న యువరాజ్‌

Published Sat, Dec 3 2016 9:17 AM | Last Updated on Mon, May 28 2018 2:02 PM

మరోసారి పెళ్లి చేసుకున్న యువరాజ్‌ - Sakshi

మరోసారి పెళ్లి చేసుకున్న యువరాజ్‌

టీమిండియా ఆల్‌ రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌, బాలీవుడ్‌ నటి హజల్‌ కీచ్‌ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గత బుధవారం చండీగఢ్‌ సమీపంలో యువీ సిక్కుల సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. కాగా శుక్రవారం గోవాలో యువీ, హజల్‌లు హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం చేసుకున్నారు. నిరాడంబరంగా జరిగిన ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులు పాల్గొన్నారు. హజల్‌ కీచ్‌ తల్లి భారతీయురాలు కాగా, తండ్రి బ్రిటన్‌ వాసి. హజల్‌ తల్లి బిహార్‌కు చెందిన హిందువు. దీంతో ఇరు కుటుంబ సభ్యుల కోరిక మేరకు యువీ, హజల్‌ల వివాహాన్ని సిక్కు, హిందూ సంప్రదాయాల ప్రకారం నిర్వహించారు. ఈ నెల 7న ఢిల్లీలో వీరి వివాహ రిసెప్షన్‌ జరగనుంది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ సహా బాలీవుడ్‌ తారలు అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌ హాజరవుతున్నట్టు సమాచారం.

సిక్కుల సంప్రదాయం ప్రకారం జరిగిన పెళ్లి కోసం హజల్‌ కీచ్‌ పేరును మార్చుకుంది. బాబా రామ్‌ సింగ్‌ డేరాలో యువీ, హజల్‌ల వివాహం జరిగింది. ఈ వేడుకల్లో హజల్‌ కీచ్‌ పేరును గుర్బసంత్‌ కౌర్‌గా సంబోంధించారు. పెళ్లికి హాజరైన అతిథులు తొలుత షాక్‌ తిన్నా తర్వాత విషయం తెలుసుకున్నారు. యువరాజ్‌, అతని తల్లి షబ్నం.. బాబా రామ్‌ సింగ్‌ను ఆరాధిస్తారు. దీంతో మతపెద్దల సూచన మేరకు హజల్‌ కీచ్‌ పేరును మార్చినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement