నా జీవితంలో మొదటిసారి ఇబ్బంది లేకుండా శ్వాస తీసుకుంటున్నా.. ఇందుకు సహకరించిన మా అత్తగారికి ధన్యవాదాలు అంటూ నటి, క్రికెటర్ యువరాజ్ సింగ్ భార్య హాజిల్ కీచ్ ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. తనను ఎల్లవేళలా తల్లిలా కనిపెట్టుకుని ఉంటున్న యువీ తల్లి షబ్నమ్ సింగ్‌కు ముందుగానే మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి.. తమ మధ్య ఉన్న అనుబంధాన్ని చాటుకున్నారు. ఇక.. తన ముక్కుకు సర్జరీ జరిగిన కారణంగానే ఇన్నాళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానని..ఇకపై అభిమానులకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.
లవ్ యూ షాబూ!!
‘ఇన్నాళ్లుగా ఎక్కడ దాక్కున్నానా అని ఆశ్చర్యపోయారు కదా. గత నెలలో నా ముక్కుకు సర్జరీ జరిగింది. ఎన్నో ఏళ్లుగా పట్టి పీడిస్తున్న సమస్యను అధిగమించేందుకు మా అత్తగారు సహకరించారు. ముద్దుగా కోప్పడి మరీ నన్ను సర్జరీకి తీసుకువెళ్లారు. ఇలాంటి అత్తగారు దొరకడం నా అదృష్టం. అంతర్గతంగా తలెత్తిన సమస్యల వల్ల శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడ్డాను. షాబూ పుణ్యమాని ప్రస్తుతం జీవితంలో మొదటిసారిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా శ్వాస తీసుకోగలుగుతున్నా. ఈ క్రమంలో డైట్ నిర్లక్ష్యం చేయడం, వ్యాయామం చేయకపోవడం వల్ల కాస్త లావయ్యాను. అందుకే ఫొటోలు అప్‌లోడ్ చేయలేదు. కానీ జీవితం ఎప్పుడు ఎవరిని ఎక్కడికి తీసుకుపోతుందో తెలియదు. ఆరోగ్యంగా జీవించడమే ముఖ్యం కదా. లవ్ యూ షాబూ! హ్యాపీ మదర్స్ డే అంటూ షబ్నమ్ సింగ్‌తో కలిసి దిగిన ఫొటోను హాజిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘ మంచి భార్యగా గుర్తింపు పొందిన మీరు లావయ్యానని బాధ పడకండి. మీరు చాలా అందంగా ఉన్నారు. మీ అత్తగారితో ఉన్న అనుబంధం గొప్పది’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment