
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బర్త్‌డే నేడు(జనవరి 19). ఈ సందర్భంగా అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా వరుణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాఫ్యామిలీ నుంచి చిరంజీవి, నాగబాబు, సాయితేజ్, నిహారిక సోషల్ మీడియా ద్వారా వరుణ్ తేజ్‌కి బర్త్‌డే విషెస్ తెలియజేశారు. తాజాగా చిరంజీవి కూతురు శ్రీజ.. తన సోదరుడికి బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
‘పుట్టిన రోజు శుభాకాంక్షలు తమ్ముడు. పొడుగ్గా ఉన్నంత మాత్రాన తెలివైన వాళ్లమని అనిపించుకోలేరు. అందుకే నీ కోసం నేను ఉన్నాను. నా బాల్యాన్ని ఎంతో సంతోషంగా గడిచేలా చేశావు. అంతేకాదు నాకు సపోర్ట్‌గా ఉన్నావు. ఎంతో ప్రేమించావు. నీ మీద నాకు మాటల్లో చెప్పలేనంత ప్రేమ ఉంది’అంటూ వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్‌లతో దిగిన ఫోటోని ఇన్‌స్టాలో షేర్ చేసింది శ్రీజ. ప్రస్తుతం శ్రీజ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment