
∙వేణుగోపాల్, తమన్, ధ్రువన్
‘ఎగిరెనే ఎగిరెనే అటు ఇటు మనసే..’ అంటూ మొదలవుతుంది ‘రోటీ కపడా రొమాన్స్’ చిత్రంలోని ‘అరెరె అరెరె..’ పాట. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘా లేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఇది. విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ నిర్మిస్తున్నారు. కాగా ‘అరెరె అరెరె..’ పాట లిరికల్ వీడియోను సంగీతదర్శకుడు తమన్ విడుదల చేశారు.
ఆర్.ఆర్. ధ్రువన్ స్వరపరచిన ఈ పాటను రఘురామ్ రాయగా, కపిల్ కపిలన్ పాడారు. ‘‘అరెరె అరెరె...’ పాటలో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ధ్రువన్ మల్టీ టాలెంటెడ్. తను పాటల రచయితగా, సింగర్‌గా నాకు తెలుసు. ఈ చిత్రంతో అతను సంగీతదర్శకుడిగా మారడాన్ని నమ్మలేకపోతున్నాను’’ అన్నారు తమన్. ‘‘నలుగురి స్నేహితుల కథే ఈ చిత్రం’’ అన్నారు విక్రమ్‌రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, ఆర్‌ఆర్ ధ్రువన్, వసంత్. జి.
Comments
Please login to add a commentAdd a comment