
∙శ్రీనాథ్, జీవీ ప్రకాశ్ కుమార్, ప్రణవ్, షాజ్ఞ, భువన్ రెడ్డి
‘‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు–500143’ చిత్రంలోని ‘డూడుం డుక్కుడుం..’ పాట బాగుంది. ఈ సాంగ్‌కి క్లాసికల్ టచ్ ఇవ్వడం బాగా నచ్చింది. ఈ సినిమాలోని ఇతర పాటలు ఎలా ఉంటాయో అని ఆసక్తి పెరిగింది. ఈ చిత్రం తప్పకుండా మ్యూజికల్ హిట్ అవుతుంది’’ అని సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్ అన్నారు.
ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా శ్రీనాథ్ పులకురం దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు– 500143’. కొవ్వూరి అరుణ సమర్పణలో బ్లాక్ యాంట్ పిక్చర్స్‌పై భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మించిన ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. కార్తీక్ రోడ్రిగ్జ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘డూడుం డుక్కుడుం..’ పాటని జీవీ ప్రకాశ్ కుమార్ విడుదల చేశారు. శ్రీ సాయి కిరణ్ సాహిత్యం అందించిన ఈ పాటను మంగ్లీ పాడారు. ఈ చిత్రానికి కెమెరా: నిఖిల్ సురేంద్రన్, నేపథ్య సంగీతం: కమ్రాన్.
Comments
Please login to add a commentAdd a comment