Watch: Chiranjeevi Waltair Veerayya Movie Poonakalu Loading Lyrical Song Released - Sakshi
Sakshi News home page

Waltair Veerayya Songs: వాల్తేరు వీరయ్య నుంచి పూనకాలు లోడింగ్‌ సాంగ్‌.. గొంతు కలిపిన చిరు, రవితేజ

Published Fri, Dec 30 2022 6:18 PM | Last Updated on Fri, Dec 30 2022 7:37 PM

Poonakalu Loading Lyrical Song From Chiranjeevi Waltair Veerayya Song - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి బాబీ డైరెక్షన్‌లో నటిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. చాలా కాలం తర్వాత చిరంజీవి నటిస్తున్న మాస్ మసాలా మూవీ ఇది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరంజీవి తో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తున్నాడు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల రిలీజ్‌ అయిన బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వీరయ్య టైటిల్ సాంగ్‌కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

చదవండి: బాలయ్య ‘అన్‌స్టాపబుల్‌ షో’పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!

ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ సాంగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించే మరో మాస్‌ సాంగ్‌ను వదిలారు మేకర్స్‌. ‘డొంట్‌ స్టాప్‌ డ్యాన్సింగ్‌.. పూనకాలు లోడింగ్‌’ అంటూ సాగే ఈ పాటను రామ్‌ మిర్యాల, రోల్‌రైడాలు ఆలపించగా దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించాడు. అంతేకాదు మధ్య మధ్యలో చిరు, రవితేజలు కూడా ఈ పాటకు తమ గొంతు కలపడమే కాదు కలిసి స్టెప్పులు కూడా వేశారు. దీంతో ఒకే ఫ్రేంలో చిరు, రవితేజను చూస్తుంటే మెగా, మాస్‌ మహారాజ ఫ్యాన్స్‌కి నిజంగానే పూనకాలు తెప్పించేలా ఉంది. 

చదవండి: రొమాంటిక్‌ సీన్స్‌లో హీరోల ప్రవర్తన అలా ఉంటుంది: తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement