Namasthe Set Ji: ఆకట్టుకుంటున్న ‘మాయదారి కరోనా’ సాంగ్‌ | Namasthe Set Ji: Maya Dari Corona Song Out | Sakshi
Sakshi News home page

Namasthe Set Ji: ఆకట్టుకుంటున్న ‘మాయదారి కరోనా’ సాంగ్‌

Published Sun, May 30 2021 5:16 PM | Last Updated on Sun, May 30 2021 5:16 PM

Namasthe Set Ji: Maya Dari Corona Song Out - Sakshi

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్లో తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం ‘నమస్తే సేట్ జీ’.తల్లాడ సాయికృష్ణ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న ఈ సినిమా లో రెండో లిరికల్ సాంగ్ ‘మాయా దారి కరోనా’ ని శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ.. ‘నమస్తే సేట్ జీ సినిమా లో డప్పు మల్లన్న అనే పాత్ర చాలా కీలకమైనది. నటుడు శోభన్ బాబు ఈ పాత్ర లో యాక్ట్ చేశాడు. సమకాలీన పరిస్థితుల్ని చూపిస్తూ, ఫ్రంట్ లైన్ వారియర్స్ గురించి కూడా తెలుపుతున్న ఈ పాటకి రిటైర్డ్  ఐఏఎస్‌ డా చింతల శ్రీనివాస్ లిరిక్స్ అందించారు. వి.ఆర్.ఏ.ప్రదీప్ అద్భుత సంగీతం అందించారు’అని అన్నారు.

లిరిసిస్ట్ డాక్టర్ చింతల శ్రీనివాస్ మాట్లాడుతూ.‘నమస్తే సేట్ జీ సినిమా కి నేను ఈ పాటని అందించడం చాలా గర్వపడుతున్నాను, ఎందుకంటే ప్రస్తుతం కరోనా మహమ్మారి వలన మనం ఎదుర్కొంటున్న సమస్యల్ని పాట రూపంలో ప్రేక్షకులకు అందించాం. ఈ పాట విని తర్వాతనైనా కొంతమంది బాధ్యత గా మెదులుకుంటారు అని ఆకాంక్షిస్తున్నాను’అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement