Chandrasekhar Yeleti, Gunnam Gangaraju Release O Kala Movie First Song - Sakshi
Sakshi News home page

O Kala Movie Song: చంద్ర శేఖర్ యేలేటి, గుణ్ణం గంగరాజు చేతుల మీదుగా ఓ కల మూవీ సాంగ్‌ రిలీజ్‌

Published Mon, May 30 2022 7:01 PM | Last Updated on Mon, May 30 2022 7:21 PM

Chandrashekhar Yeleti, Gunnam Gangaraju Release O Kala Movie First Song - Sakshi

దీపక్ కొలిపాక దర్శకత్వంలో గౌరీశ్ యేలేటి, రోషిణి, ప్రాచీ టక్కర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ఓ కల. ఎటిర్నిటి ఎంటర్‪టైన్‪మెంట్, అహం అస్మి ఫిల్మ్స్ బ్యానర్లపై లక్ష్మీ నవ్య మోతూరు, రంజిత్ కుమార్ కొడాలి, అదిత్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్‌ని ప్రముఖ దర్శకులు చంద్రశేఖర్ యేలేటి, ప్రముఖ దర్శక నిర్మాత గుణ్ణం గంగరాజు సంయుక్తంగా విడుదల చేశారు.

విడుదల అనంతరం వారు మాట్లాడుతూ.. ‘‘ఓ కల మూవీ ఫస్ట్ సాంగ్ చాలా ఫ్రెష్‌గా, కొత్తగా  ఉంది. ఇందులోనే సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. దర్శకుడు దీపక్ కొలిపాక ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని భావిస్తున్నాను. ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని తెలిపారు. ఇక దర్శకుడు దీపక్ కొలిపాక మాట్లాడుతూ.. ‘తెలుగు సినిమాకి  మంచి గుర్తింపుని తీసుకువచ్చిన మన దర్శకనిర్మాతలు గుణ్ణం గంగరాజు, చంద్రశేఖర్ యేలేటి గార్ల చేతుల మీదుగా ఈ మూవీ ఫస్ట్ సాంగ్ విడుదలవడం నిజంగా సంతోషంగా ఉంది. సినిమా విషయానికి వస్తే.. ఇది చక్కని ప్రేమకథ’ అన్నారు.

‘హీరో గౌరీశ్.. టాలెంటెడ్ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటిగారికి బంధువు. ప్రతి సీన్‌ని చక్కగా అర్థం చేసుకుని నటించాడు.  అతనికి మంచి భవిష్యత్ ఉంటుంది. హీరోయిన్లు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఎంతగానో సహకరిస్తున్నారు. నిర్మాతలు ఇచ్చిన ప్రోత్సాహం మరవలేనిది. ప్రేక్షకులు మంచి ప్రేమ కథను చూసి చాలా కాలం అవుతుంది. ఆ లోటును మా చిత్రం తీరుస్తుందని ఖచ్చితంగా చెప్పగలను’ అని ధీమా వ్యక్తం చేశారు. కాగా ఈసినిమాలో అలీ, వైవా రాఘవ్‌, దేవి ప్రసాద్‌,శక్తి, కమెడియన్‌ రవితేజ తదితరులు నటిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement