వాలంటైన్స్‌ డే: శాకుంతలం చిత్రం నుంచి మరో మెలోడీ సాంగ్‌ | Madhura Gathama Song Release From Samantha Shaakuntalam Movie | Sakshi
Sakshi News home page

Shaakuntalam Movie Fourth Single: శాకుంతలం మూవీ నుంచి మరో మెలోడీ సాంగ్‌

Published Tue, Feb 14 2023 8:55 PM | Last Updated on Tue, Feb 14 2023 9:00 PM

Madhura Gathama Song Release From Samantha Shaakuntalam Movie - Sakshi

స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్‌ మూవీ ‘శాకుంతలం’. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిన శాకుంతలం ఫిబ్రవరి 17న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా దర్శకుడు గుణ శేఖ‌ర్ పౌరాణిక ప్రేమ కావ్యంగా శాకుంతలంను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టిజర్‌, ట్రైలర్‌, పాటలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శాకుంతలం పాటలు అయితే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ జాబితాలో నిలిచాయి. నేడు ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం మరో మెలోడీ సాంగ్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం.

‘మధుర గతమా..’ అంటూ సాగే ఈ పాటను తాజాగా విడుదల చేశారు. శ్రీమని సాహిత్యం అందించిన ఈ పాటను అర్మాన్‌ మాలిక్‌, శ్రేయా ఘోషల్‌ ఆలపించారు. కాగా ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మా మణిశర్మ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా సమంత లీడ్‌ రోల్‌ చేస్తున్న ఈ మూవీ మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ దుష్యంతుడిగా నటించాడు. అల్లు అర్జున్‌ ముద్దుల తనయ అర్హ భరతుడి పాత్ర పోషించగా.. ప్రకాశ్‌ రాజ్‌, మోహన్‌ బాబు, గౌతమి, మధుబాలలు కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వ‌ర‌ క్రియేష‌న్స్ దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో గుణ టీమ్ వ‌ర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు. శాకుంతం మూవీ ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement