
సాక్షి, హైదరాబాద్: భారతి సిమెంట్స్ నిర్మాణంలో ప్రముఖ ఆల్బమ్ తయారీ సంస్థ సెవెన్ నోట్స్ ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఖేలో ఇండియా జీతో ఇండియా’అనే గీతాన్ని ఆదివారం రెడ్ ఎఫ్‌ఎం వేదికగా ఆవిష్కరించారు. టీ 20 వరల్డ్‌కప్ క్రికెట్ టోర్నీ ఆదివారం ప్రారంభమైన నేపథ్యంలో ఈ పాటను రూపొందించామని భారతి సిమెంట్స్ యాడ్స్ మేనేజర్ విజయ్ తెలిపారు.
రచయిత సిరాశ్రీ రాసిన పాటకు తాళ్లూరి నాగరాజు సంగీతాన్ని సమకూర్చారు. ప్రముఖ గాయకుడు కార్తిక్ గాత్రం అందింగా సత్య మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. టీ 20 వరల్డ్‌కప్ సాధించడానికి టీమిండియాకు అన్ని అర్హతలున్నాయని, ఈసారి కప్‌తో వస్తారని సెవెన్ నోట్స్ క్యూరేటర్ మణి ఆశాభావం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ పాటతో టీమిండియాకు అభినందనలు తెలుపుదామని పిలుపునిచ్చారు.