Actress Samantha Crazy Comments In Shaakuntalam Press Meet at Hyderabad - Sakshi
Sakshi News home page

Samantha: ఆ సమయంలోనే మరింత స్ట్రాంగ్‌గా తయారయ్యా: సమంత

Published Mon, Apr 10 2023 7:45 PM | Last Updated on Mon, Apr 10 2023 8:07 PM

Samantha Crazy Comments In Shaakuntalam Press Meet in Hyderabad - Sakshi

సమంత తాజాగా నటించిన చిత్రం 'శాకుంతలం'. గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడటంతో వరుస ఇప్పటికే ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శాకుంతలం మూవీ ప్రెస్‌ మీట్ నిర్వహించింది. ఈవెంట్‌లో పాల్గొన్న సమంత పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో దేవ్ మోహన్ దుష్యంతుని పాత్రలో నటిస్తున్నారు. 

సమంత మాట్లాడుతూ..'చిన్నప్పుడు ఈ కథ నాకు కొంత తెలుసు. నా ప్రతీ సినిమాకు ది బెస్ట్ ఇవ్వడానికి కృషి చేస్తా. ఫస్ట్ నేను ఈ క్యారెక్టర్ చేయడానికి భయపడ్డా. నాకు అన్ని ఉన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నా. కానీ క్లిష్ట  సమయంలోనే  నేను చాలా స్ట్రాంగ్‌గా తయారయ్యా. అర్హ స్క్రీన్ మీదకు వచ్చినప్పుడు అందరి ముఖాల్లో నవ్వు కనపడుతోంది. పాన్ ఇండియా సినిమాకు నా బెస్ట్ కోసం ఎంతో కృషి చేశా.' అని అన్నారు. 

(ఇది చదవండి: సమంత నాగచైతన్యను ఉద్దేశించి ఆ కామెంట్స్‌ చేసిందా?)

దిల్ రాజు మాట్లాడుతూ.. 'మన సొంత ప్లేస్‌లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఏం చెప్పినా ప్రతిదీ వైరల్ అవుతుంది. కానీ బయట ప్లేస్‌లో అలా అవసరం లేదు బోల్డ్‌గా చెప్పొచ్చు. నాకు సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరు ఉంది. ఈ జానర్‌లో కూడా చేద్దామనని ఈ సినిమా చేశా. ఏ భాషలో అయినా స్టార్ హీరోలు స్టార్ హీరోలే.' అని అన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement