
స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన శాకుంతలం ఫిబ్రవరి 17న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఏప్రిల్ 14న శాకుంతలం ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్ల తాజాగా ప్రకటన ఇచ్చారు. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా దర్శకుడు గుణ శేఖర్ పౌరాణిక ప్రేమ కావ్యంగా శాకుంతలంను తెరకెక్కించారు.
చదవండి: ప్రకాశ్ కామెంట్స్‌పై ఘాటుగా స్పందించిన కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్
ఇప్పటికే ఈ సినిమా ప్రచార పోస్టర్లు, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో ఈ చిత్రంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా సమంత లీడ్ రోల్ చేస్తున్న ఈ మూవీ మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటించాడు. అల్లు అర్జున్ ముద్దుల తనయ అర్హ భరతుడి పాత్ర పోషించగా.. ప్రకాశ్ రాజ్, మోహన్ బాబు, గౌతమి, మధుబాలలు కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
The Love that was forgotten... An unforgettable tale of Love that remains🦢#Shaakuntalam in theatres worldwide on April 14🤍@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan #ManiSharma @neelima_guna @GunaaTeamworks @SVC_official @tipsofficial @tipsmusicsouth #ShaakuntalamOnApril14 pic.twitter.com/sUG21bjYUM
— Gunaa Teamworks (@GunaaTeamworks) February 10, 2023
Comments
Please login to add a commentAdd a comment