
వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది సమంత. ఒకవైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది. త్వరలోనే ఈ బ్యూటీ నటించిన ‘శాకుంతలం’చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సామ్.. నటీ నటుల పారితోషికంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కష్టాన్ని చూసి దానికి తగ్గట్టుగా పారితోషికం ఇస్తే బాగుంటుందని సమంత అభిప్రాయపడింది.
‘నా శ్రమ చూసి ‘మేము మీకు ఇంత రెమ్యునరేషన్ ఇవ్వాలనుకుంటున్నాం’అని నిర్మాతలే చెప్పాలి. అంతేకానీ నాకు ఇంత పారితోషికం ఇవ్వండి అని నేను యాచించాల్సిన అవసరం లేదు. మన కృషి ఆధారంగా ఇది వస్తుందని నమ్ముతాను. మన శక్తి సామర్థ్యాలు పెంచుకుంటూ పోవాలి’అని సమంత చెప్పుకొచ్చింది.
ఇక శాకుంతలం సినిమా విషయానికొస్తే.. డైరెక్టర్ గుణ శేఖర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మైథిలాజికల్ మూవీగా రూపొందించిన ఈ శాకుంతలం సినిమాలో సమంత లీడ్ రోల్ పోషించగా, దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. పాన్ ఇండియా మూవీ గా ఏప్రిల్ 14న ఈ చిత్రం విడుదల కాబోతుంది.
Comments
Please login to add a commentAdd a comment