ప్రస్తుతం డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకుల బ్యాంక్ అకౌంట్స్ నుంచి లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. చదవురాని వారితో పాటు అన్ని తెలిసి కూడా సైబర్ ఉచ్చులో పడుతున్నారు. కొత్త కొత్త మార్గాల్లో సైబర్ నేరగాళ్లు ప్రజలను మభ్యపెట్టి దోచుకుంటున్నారు. అయితే సెలబ్రిటీలు సైతం వీరి బారిన పడటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా హీరోయిన్ అనన్య నాగళ్ల తనకెదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అసలేం జరిగిందో మీరు ఓ లుక్కేయండి.
అనన్య మాట్లాడుతూ.. 'తన పేరుతో సిమ్ తీసుకుని నేరాలకు పాల్పడుతున్నారని నాకు ఫోన్ చేశారు. మీ పేరుతో ఉన్న నంబర్ ద్వారా కొందరు మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నారు. ముంబయిలోని ట్రాయ్ కార్యాలయం నుంచి కాల్ చేస్తున్నాం. మీ నంబర్‌పై దాదాపు 25 వరకు మనీలాండరింగ్ లావాదేవీలు జరిగాయి.. మీకు జైలు శిక్ష పడుతుందని బెదిరించారు. కొద్దిసేపు వీడియో కాల్ ఆన్‌లో ఉంచి.. ఆ తర్వాత ఆఫ్ చేశారు. దీనిపై మీరు ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేయండి.. అని వీడియో కాల్ ద్వారా కనెక్ట్ అయి నన్ను నమ్మించేందుకు కొన్ని డాకుమెంట్స్ చూపించారు. అంతేకాదు.. ఆర్బీఐకి మీరు మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలని నన్ను అడిగారు. ఆ తర్వాత నాకు థర్డ్ పార్టీ అకౌంట్ నంబర్ పంపి డబ్బులు బదిలీ చేయాలని కోరాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చి.. నేను అతన్ని నిలదీశాను. దీంతో అతనే నాపై తిరిగి గట్టిగా మాట్లాడాడు. నేను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తానడంతో వీడియో కాల్ కట్ చేశాడు' అని తెలిపింది.
ఇలాంటివి సంఘటనలు చాలా జరుగుతున్నాయని.. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని అనన్య నాగళ్ల సూచించారు. దయచేసి ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు పలికింది. కాగా..టాలీవుడ్‌లో మల్లేశం, వకీల్ సాబ్ చిత్రాల్లో నటించింది. ఈ ఏడాది తంత్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Please be careful guys!
For full details https://t.co/XdpO2s7awh@cyberabadpolice @cpbbsrctc pic.twitter.com/d7EK5rVWAW— Ananya Nagalla (@AnanyaNagalla) June 24, 2024
Comments
Please login to add a commentAdd a comment