
తెలుగమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘తంత్ర’. మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది అనన్య. వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా గురించి, తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది. తాజాగా తన పెళ్లి గురించి కూడా స్పందించింది.

ప్రస్తుతం తనకు బాయ్ ఫ్రెండ్ లేడని.. ప్రేమ పెళ్లా లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లా అనేది కాలమే నిర్ణయిస్తుందని చెబుతోంది. ఒకవేళ ప్రేమ పెళ్లి చేసుకుంటే మాత్రం ఇండస్ట్రీకి చెందిన వారిని మాత్రం చేసుకోబోనని స్పష్టం చేసింది

‘పెళ్లి గురించి ఇప్పుడేం ఆలోచించడం లేదు. ఒకవేళ ప్రేమ పెళ్లి చేసుకుంటే మాత్రం ఇండస్ట్రీకి చెందిన వారిని చేసుకోను. సినీ రంగంలో ఉన్న కొందరికి పెళ్లి చేసుకున్నాక భార్యపై ప్రేమ తగ్గిపోతుంది

సినీ ఇండస్ట్రీలో వివాహేతర సంబంధాలు ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి పెళ్లి తర్వాత వాడుకొని వదిలేస్తారు. అందుకే నేను సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారిని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. అయితే ఇండస్ట్రీలో ఉన్న వారు కొందరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

వాళ్ల ఆలోచన, ప్రవర్తన జీవితం పట్ల ఉన్న అవగాహన వేరు. ఈ తరం వాళ్ళకి అలాంటివి ఏమీ లేవు. అందుకే నాకు అంతగా నమ్మకం లేదు. ఇప్పుడున్న యూత్‌లో సిరియస్‌నెస్ లేదు’ అంటూ పెళ్లిపై తన అభిప్రాయం చెప్పింది

అలాగే తనకు కాబోయే వరుడు ఎలా ఉండాలో కూడా మరో ఇంటర్వ్యూలో చెప్పింది. తనకు కాబోయేవాడికి గెడ్డం కచ్చితంగా ఉండాలని.. ఎత్తు, కలర్ గురించి పెద్దగా పట్టించుకోబోనని, హానెస్ట్‌గా ఉంటే చాలని అనన్య చెప్పుకొచ్చింది.




