ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు: అనన్య | Ananya Nagalla Talk About Srikakulam Srikakulam Sherlockholmes Movie | Sakshi
Sakshi News home page

ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు: అనన్య

Published Sat, Dec 21 2024 5:45 PM | Last Updated on Sat, Dec 21 2024 6:11 PM

Ananya Nagalla Talk About Srikakulam Srikakulam Sherlockholmes Movie

‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌’ లో భ్రమరాంబ పాత్రలో నటించాడు. కథలో నా రోల్‌ చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు నేను అలాంటి పాత్రలో నటించలేదు. ఇది చాలా డిఫరెంట్‌ మూవీ’ అంటున్నారు యంగ్‌ హీరోయిన్‌ అనన్య నాగళ్ల. వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌'. రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహించారు. అనన్య నాగళ్ల, సీయా గౌతమ్ కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్‌ 25న ఈ చిత్రం ప్రే​క్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో అనన్య తాజాగా మీడియాతో ముచ్చటించారు.

ఇప్పటివరకూ ఇలాంటి కథ నేను వినలేదు. మోహన్ గారు కథ చెప్పినపుడు చాలా కొత్తగా అనిపించింది. ఒక సంఘటన జరిగినపుడు అందులో ఒకొక్కరి కోణం నుంచి ఒకొక్క పెర్స్ఫెక్టివ్ ఉంటుంది. ఇలా కథని తీసుకెళ్లడం నాకు చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించింది. కథ వినగానే ఓకే చెప్పాను. వందశాతం ఆడియన్స్ కి ఈ సినిమా మంచి క్రిస్మస్ గిఫ్ట్ అవుతుంది.

 ఇందులో డిటెక్టివ్ అమ్మ పేరు షర్మిలమ్మ, నాన్న పేరు లోకనాథ్, తన పేరు ఓం ప్రకాష్. ఈ మూడు పేర్లలో ఫస్ట్ లెటర్ సౌండింగ్ తో షెర్లాక్ హోమ్స్‌ అని పెట్టడం జరిగింది. తెలుగులో డిటెక్టివ్ సినిమా అనగానే చిరంజీవి గారి చంటబ్బాయ్ గుర్తుకు వస్తుంది. అందుకే అందరికీ కనెక్ట్ అయ్యేవిధంగా ఆ ట్యాగ్ ని పెట్టడం జరిగింది.

 మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు వైజాగ్ పర్యటన ముగించుకొని అదే రోజు శ్రీపెరంబుదూర్ వెళ్లి అక్కడ చనిపోయారు. ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు చిన్న సంఘటనలని ఎవరూ పట్టించుకోరు. అదే రోజు ఓ కేసు జరిగింది. ఆ కేసు తీగలాగితే డొంక కదిలినట్లుగా చాలా మలుపులతో కథనం ఎంగేజింగ్ గా ఉంటుంది.  

 తెలుగుతో పాటు హిందీలో ఓ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా  చేస్తున్నాను. నా సీనీ జర్నీ పట్ల హ్యాపీగా ఉన్నాను. నాకు కంటిన్యూ గా వర్క్ వస్తోంది. రీసెంట్ గా పోట్టేల్ సినిమాకి మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత నా దగ్గరకి మంచి కథలు వచ్చాయి. ఓ రెండు సినిమాలు సైన్ చేశాను.

 ప్రస్తుతం తెలుగులో కథాకళి, లేచింది మహిళా లోకం సినిమాలు  రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement