
అనన్య నాగళ్ల.. ఈ తెలుగందం త్వరలో భయపెట్టేందుకు రెడీ అయింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన హారర్ మూవీ తంత్ర మార్చి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ చేస్తోందీ బ్యూటీ. ఈ క్రమంలో రక్తం అమ్ముతూ ఓ హారర్ స్కిట్ చేసిన అనన్య నాగళ్ల ప్రస్తుతం ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది. ఈ మధ్యే నిర్మొహమాటంగా తాను సర్జరీ చేసుకున్నట్లు వెల్లడించింది అనన్య. లిప్ ఫిల్లర్స్ వాడినట్లు తెలిపింది.
లిప్ ఫిల్లర్స్..
తాజాగా మరోసారి ఈ ప్రశ్న ఎదురవడంతో.. అసలు ఎందుకు లీక్ చేసాన్రా దేవుడా అని తల బాదుకుంది. ఆమె మాట్లాడుతూ.. లిప్ ఫిల్లర్ అనే చిన్నపాటి సర్జరీ చేయించుకున్నాను. అయితే అదేమీ శాశ్వతంగా ఉండదు. ఒక ఏడాదిలో పెదాలు మళ్లీ మామూలైపోతాయి. అప్పుడప్పుడూ మనకు హెయిర్ స్టెయిల్ మార్చాలని ఉంటుంది కదా.. అలా ఊరికే ట్రై చేయాలనిపించింది. అందుకే లిప్ ఫిల్లర్ చేయించుకున్నాను. కానీ ఇప్పుడది పోయింది' అని చెప్పుకొచ్చింది.
2022లోనే సర్జరీ రూమర్స్
ఇకపోతే అనన్య నాగళ్ల తన పెదాలకు సర్జరీ చేయించుకున్న విషయాన్ని అభిమానులు ఎప్పుడో పసిగట్టారు. 2022లోనే తను లిప్స్‌కు సర్జరీ చేయించుకుందంటూ వార్తలు వెలువడ్డాయి. ఇన్నాళ్లకు ఆ సర్జరీ నిజమేనని అంగీకరించింది అనన్య.
Comments
Please login to add a commentAdd a comment