
ఓటీటీల్లో సినిమాలు అనగానే చాలామందికి థ్రిల్లర్సే గుర్తొస్తాయి. ఎందుకంటే యాక్షన్, కామెడీ మూవీస్ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయొచ్చు. అదే థ్రిల్లర్ లేదా హారర్ చిత్రాలు మాత్రం ఓటీటీలో ఒంటరిగా చూసి ఎంటర్‌టైన్ అవ్వొచ్చు. ఇలా తెలుగులో ఎప్పటికప్పుడు ఏదో ఓ మూవీ వస్తూనే ఉంటుంది. అలా గతేడాది నవంబరులో థియేటర్లలోకి వచ్చిన ఓ మూవీ.. ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)
'వకీల్ సాబ్' ఫేమ్ అనన్య నాగళ్ల హీరోయిన్‌గా చేసిన సినిమా 'అన్వేషి'. విజయ్ ధరణ్, సిమ్రన్ గుప్తా హీరోహీరోయిన్‌గా చేశారు. రొమాంటిక్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ చిత్రం.. థియేటర్లలో పెద్దగా ఆడలేకపోయింది. కంటెంట్ పరంగా ఓకే అనిపించుకున్నప్పటికీ స్టార్స్ ఎవరూ లేకపోవడంతో జనాలు దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. ప్రస్తుతానికి రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. త్వరలో ఫ్రీగా చూసే వీలు కల్పిస్తారు.
'అన్వేషి' కథేంటి?
విక్రమ్(విజయ్‌ధరణ్ దాట్ల), అను(సిమ్రాన్ గుప్తా)తో తొలి చూపులో ప్రేమలో పడిపోతాడు. ఆమెని వెతుక్కుంటూ మారేడుకోన అనే ఊరికి వెళ్తాడు. అదే టైంలో ఆ గ్రామంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. అవన్నీ మూతపడిపోయిన అను ఆస్పత్రి ఎదుటే జరుగడంతో, అప్పటికే చనిపోయిన డాక్టర్ అను(అనన్య నాగళ్ల)నే ఊరి జనాలను చంపుతుందని గ్రామస్తులంతా నమ్ముతారు. ఈ క్రమంలో విక్రమ్.. ఈ హత్యల వెనకున్న మిస్టరీ ఛేదించే ప్రయత్నం చేస్తాడు. చివరకు ఏమైంది అనేదే మూవీ.
(ఇదీ చదవండి: మాట నిలబెట్టుకున్న రైతుబిడ్డ ప్రశాంత్.. వాళ్లకు రూ.లక్ష సాయం)
Comments
Please login to add a commentAdd a comment