
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ల ముద్దుల తనయ ఆరాధ్య బచ్చన్ పుట్టిన రోజు నేడు. సోమవారం 9వ పడిలోకి అడుగుపెట్టారు ఈ చిన్ని బచ్చన్. ఆరాధ్య తాత, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ 9వ పడి వరకు ప్రతీ ఏటా దిగిన ఫొటోలను ఓ చోట చేర్చి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ‘ఆరాధ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. నా ప్రేమతో’ అనే శీర్షికను ఉంచారు. ( డైరెక్టర్‌తో స్టెప్పులేయించిన శ్రుతీ హాసన్ )
తన ట్విటర్ ఖాతాలో ఆరాధ్యకు సంబంధించిన ఓ వీడియో పోస్టును కూడా ఆయన షేర్ చేశారు. ఓ అభిమాని షేర్ చేసిన పోస్టును ఆయన రీట్వీట్ చేశారు. దీపావళి సందర్భంగా మనవరాలు దేవుడి పాట పాడుతున్న వీడియో అది. ‘జై సియ రామ్, జై జై సియ రామ్’ అంటూ పాడుతూ.. దానికి తగ్గట్టుగా చక్కడా ఆడింది.
Comments
Please login to add a commentAdd a comment