
ఈసారి అమితాబ్ వాలెంటైన్ ఎవరంటే..?
ముంబయి: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఏం చేసినా జనాలు ఇట్టే ఆకర్షితులై పోతారు. ఆయన చేసే ప్రతి పని కూడా అంతే ఆసక్తిగా ఉంటుంది. సాధారణంగా ప్రేమికుల రోజు అంతా తమ ప్రియమైన వారితో గడుపుతారు. ఆ విషయాలు చాలా గోప్యంగా ఉంచుతారు. కొంతమంది మాత్రమే ఆ విషయాలు బయటకు చెబుతారు. బాలీవుడ్ బిగ్ బీ మాత్రం తాను ఈసారి గడిపిన తన వాలెంటైన్ గురించి చెప్పారు. అయితే, ఆ వాలెంటైన్ ఎవరో కాదు.. తన ముద్దుల మనువరాలు ఆరాధ్య. అవును.. అమితాబ్ బచ్చన్ ఈసారి ప్రేమికుల రోజును తన చిట్టిపొట్టి మనుమరాలితో సరదాగా గడిపారంట.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన బ్లాగ్‌లో రాశారు. ఓ ఇటాలియన్ రెస్టారెంటుకు వెళ్లి ఏం చక్కా పిజ్జా లాగించేశారంట. ఆ తర్వాత పిజ్జా తీసుకొచ్చిన వెయిటర్స్‌కు ఆరాధ్య థ్యాంక్స్ అని కూడా చెప్పిందట. ఆ తర్వాత హ్యాపీ వాలెంటైన్స్ డే అని విష్ చేసుకుంటూ తిరిగి కుటుంబమంతా ఇంటికొచ్చారని అమితాబ్ చెప్పారు. అంతేకాదు.. డిన్నర్‌కు బయటకు తీసుకెళ్లిన తనకు ఆరాధ్య థ్యాంక్స్ అని చెప్తుండగా.. అసలు ఆ ఐడియా ఇచ్చిన తనకే థ్యాంక్స్ అని చెప్పానని, తన ఆలోచనలు కుటుంబం మొత్తాన్ని ఒక చోట చేర్చిందని.. నిజంగా తను చాలా క్యూట్ కదా? అంటూ అమితాబ్ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు.