
ఎంత వినయం, ఎంత విధేయత!
ముంబై: అబ్బో ఏం వినయం. ఏం విధేయత. పెద్దలంటే ఎంత గౌరవం. ఎంత సంస్కారం. పెంపకం అంటే అది. సంస్కారమంటే ఇది. నిండా నాలుగేళ్లు కూడా లేని వయసులోనే అంత సంస్కారమంటే అది పెద్దల పెంపకానికి నిదర్శనం. వారి సంస్కృతి
సంప్రదాయాలకు మచ్చుతునక. ఇవీ.... ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్‌ల గారాలపట్టి ఆరాధ్యబచ్చన్‌పై కురిపిస్తున్న ప్రసంశలు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్తూ ఐశ్వర్యారాయ్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో తన తండ్రిని కలుసుకుంది. ఆయనకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకుంది. వెంటనే ఆమె కుమార్తె చిన్నారి ఆరాధ్య బచ్చన్ కూడా తల్లిని ఫాలో అయిపోయింది. తల్లి దగ్గర నుంచి ఒక్క ఉదుటున వెళ్లి తాతగారి కాళ్లకు నమస్కరించి, ఆశీర్వాదం తీసుకుంది. దీంతో ఐశ్వర్యతో పాటు అక్కడున్న అందరూ చిన్నారి సంస్కారానికి మురిసిపోయారు.
గతంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఏదైనా ఇంపార్టెంట్ పనిమీద బయటకు వెళ్లేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ల పాదాలకు నమస్కారం పెట్టి వెళ్లేవాడని బాలీవుడ్ జనాలు గుర్తు చేసుకుంటున్నారు. అమితాబ్ అలవాట్లు, సంస్కారం, సంప్రదాయం అతని తనయుడు అభిషేక్‌కు కూడా వచ్చాయని, అతను కూడా ముఖ్యమైన పనుల మీద వెళ్లేటప్పుడు పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటాడని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వారి సంస్కారం, సంప్రదాయాలే వారి వారసురాలు, చిన్నారి ఆరాధ్యబచ్చన్‌కు కూడా వచ్చాయని, అమితాబ్, ఐశ్వర్య ఫ్యాన్స్ ముచ్చట పడుతున్నారు.