
బాలీవుడ్ అందాల రాశి ఐశ్వర్యరాయ్, తన కూతురు ఆరాధ్యతో కలిసి పారిస్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఆరేళ్ల ఆరాధ్యతో కలిసి పారిస్ ట్రిప్ వెళ్లిన ఐష్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో రెండు ఫొటోలను షేర్ చేశారు. చెక్క గుర్రాల రంగుల రాట్నం వద్ద బ్లాక్ డ్రెస్‌లో ఉన్న ఐశ్వర్య బ్యూటీఫుల్ లుక్ ఇస్తూ ఉన్న ఫోటోను ‘టుడే’ అని క్యాప్షన్ ఇచ్చి పోస్ట్ చేశారు. అచ్చం అమ్మలాగే పోజు ఇస్తూ ఆరాధ్య అదే ప్లేస్‌లో ఫొటో దిగింది. ఈ ఫొటోను ‘మై లవ్’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఐశ్వర్య ప్రస్తుతం అనిల్ కపూర్, రాజ్‌కుమార్ రావ్‌లతో కలిసి ‘ఫన్నేఖాన్’. చిత్రంలో నటిస్తున్నారు. ‘ఎవ్రీబడీ ఫేమస్’ అనే హాలీవుడ్ చిత్రం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 3న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment