మ్యాక్స్ కార్ట్ ఓపెన్ విజేత ఆరాధ్య | Max Kart Open winner is aaradhya | Sakshi
Sakshi News home page

మ్యాక్స్ కార్ట్ ఓపెన్ విజేత ఆరాధ్య

Published Sun, May 11 2014 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 7:11 AM

మ్యాక్స్ కార్ట్ ఓపెన్ విజేత ఆరాధ్య

మ్యాక్స్ కార్ట్ ఓపెన్ విజేత ఆరాధ్య

 సాక్షి, హైదరాబాద్: మైక్రో మోటార్‌స్పోర్ట్స్ రోటాక్స్ మ్యాక్స్ కార్ట్ ఓపెన్‌లో మైక్రో మ్యాక్స్ విభాగంలో యశ్ ఆరాధ్య విజేతగా నిలిచాడు. జేకే టైర్ సంస్థ ఆధ్వర్యంలో లాహిరి రిసార్ట్స్‌లోని కార్ట్ సెంటర్‌లో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో శనివారం బెంగళూరుకు చెందిన మెకో రేసింగ్ డ్రైవర్ ఆరాధ్య.. ఐదు రేసులకుగాను నాలుగింటిలో గెలిచి 48 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. మెకో రేసింగ్‌కే చెందిన షహన్ అలీ మొహిసిన్ (ఆగ్రా) 45 పాయింట్లతో రెండో స్థానం పొందాడు. ఇక జూనియర్ మ్యాక్స్ విభాగంలో రికీ డానిసన్ (బీపీసీ రేసింగ్) 48 పాయింట్లతో విజేతగా నిలవగా, 45 పాయింట్లు సాధించిన ఆకాశ్ గౌడ (మెకో రేసింగ్)కు రెండో స్థానం దక్కింది. సీనియర్ మ్యాక్స్ కేటగిరిలో రేయో రేసింగ్ డ్రైవర్ నయన్ చటర్జీ (ముంబై) 50 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ కేటగిరిలో 45 పాయింట్లు పొందిన కొల్హాపూర్‌కు చెందిన కృష్ణరాజ్ డి మహాదిక్ (మొహైత్ రేసింగ్) రెండో స్థానంలో నిలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement