Lahiri Resorts
-
మ్యాక్స్ కార్ట్ ఓపెన్ విజేత ఆరాధ్య
సాక్షి, హైదరాబాద్: మైక్రో మోటార్‌స్పోర్ట్స్ రోటాక్స్ మ్యాక్స్ కార్ట్ ఓపెన్‌లో మైక్రో మ్యాక్స్ విభాగంలో యశ్ ఆరాధ్య విజేతగా నిలిచాడు. జేకే టైర్ సంస్థ ఆధ్వర్యంలో లాహిరి రిసార్ట్స్‌లోని కార్ట్ సెంటర్లో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో శనివారం బెంగళూరుకు చెందిన మెకో రేసింగ్ డ్రైవర్ ఆరాధ్య.. ఐదు రేసులకుగాను నాలుగింటిలో గెలిచి 48 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. మెకో రేసింగ్కే చెందిన షహన్ అలీ మొహిసిన్ (ఆగ్రా) 45 పాయింట్లతో రెండో స్థానం పొందాడు. ఇక జూనియర్ మ్యాక్స్ విభాగంలో రికీ డానిసన్ (బీపీసీ రేసింగ్) 48 పాయింట్లతో విజేతగా నిలవగా, 45 పాయింట్లు సాధించిన ఆకాశ్ గౌడ (మెకో రేసింగ్)కు రెండో స్థానం దక్కింది. సీనియర్ మ్యాక్స్ కేటగిరిలో రేయో రేసింగ్ డ్రైవర్ నయన్ చటర్జీ (ముంబై) 50 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ కేటగిరిలో 45 పాయింట్లు పొందిన కొల్హాపూర్‌కు చెందిన కృష్ణరాజ్ డి మహాదిక్ (మొహైత్ రేసింగ్) రెండో స్థానంలో నిలిచాడు. -
‘సీనియర్’ చాంప్ విష్ణుప్రసాద్
జింఖానా, న్యూస్‌లైన్: జేకే టైర్ జాతీయ రోటక్స్ మ్యాక్స్ కార్టింగ్ చాంపియన్‌షిప్‌లో విష్ణు ప్రసాద్ (మెకో రేసింగ్ జట్టు), కృష్ణరాజ్ మహాదిక్ (రెయో రేసింగ్ జట్టు)లు విజేతలుగా నిలిచారు. లహరి రిసార్ట్స్‌లోని కార్టింగ్ సెంటర్లో ఆదివారం మూడు విభాగాల్లో ఫైనల్ పోటీలు జరిగాయి. 15 ఏళ్లు పైబడిన వారు పాల్గొనే సీనియర్ మ్యాక్స్ విభాగంలో విష్ణు ప్రసాద్ చాంపియన్‌షిప్ సాధించగా, అమేయ బఫ్నా (రెయో రేసింగ్), చిత్తేశ్ మండోడి (మోహిత్ రేసింగ్) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. 13 ఏళ్ల నుంచి 16 ఏళ్ల లోపు రేసర్లు పాల్గొనే జూనియర్ మ్యాక్స్ ఈవెంట్లో కృష్ణరాజ్ మహాదిక్ (రెయో రేసింగ్) విజేతగా నిలువగా, ఆర్య చిరాగ్ గాంధీ (రెయో రేసింగ్), ఆకాశ్ గౌడ (మెకో రేసింగ్) ద్వితీయ, తృతీయ స్థానాలు పొందారు. ఏడేళ్ల నుంచి 12 ఏళ్లలోపు రేసర్లు పాల్గొనే మైక్రో మ్యాక్స్ విభాగంలో పాల్ ఫ్రాన్సిస్ (మెకో రేసింగ్) చాంపియన్‌గా నిలిచాడు. అర్జున్ నాయర్ (మెకో రేసింగ్) రెండో స్థానం, నికిల్ (ఇండియన్ కార్టింగ్) మూడో స్థానం పొందారు.