‘‘లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘ఖుషి’ సినిమా ఉంటుంది. విప్లవ్, ఆరాధ్య పాత్రల్లో విజయ్ దేవరకొండ, సమంతల నటన, భావోద్వేగాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. ఒక్క మాటలో చె΄్పాలంటే ‘ఖుషి’లో అన్ని వాణిజ్య అంశాలుంటాయి’’ అని ఛాయాగ్రాహకుడు జి. మురళి అన్నారు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఖుషి’.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జి. మురళి మాట్లాడుతూ– ‘‘సినిమాటోగ్రఫీలో శిక్షణ ΄÷ంది, సినిమాల్లోకి వచ్చాను. ఎవరి వద్దా అసిస్టెంట్‌గా చేయలేదు. తెలుగులో నా తొలి సినిమా ‘అందాల రాక్షసి’. ఆ తర్వాత ‘ఖుషి’నే. ప్రేమ గురించి కలలు కనే యువకుడికి ప్రేమ, జీవితం అంటే మన ఊహలకు అనుగుణంగా ఉండవని తెలిసి రావడమే ఈ సినిమా నేపథ్యం.
మణిరత్నంగారి సినిమాల్లో సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్‌గారు చూపించే విజువల్ బ్యూటీ ‘ఖుషి’లో చూస్తారు. అయితే అలాంటి సీన్స్‌ను మేం కాపీ కొట్టలేదు.. అలాంటి అనుభూతి కలిగించేలా విజువల్స్ ఉంటాయి. ఈ సినిమా పూర్తయ్యాక ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలుగుతుంది. కెమేరా ద్వారా ఆ ఎమోషన్‌ని తీసుకొచ్చేందుకు నా ప్రయత్నం చేశాను. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్‌గార్లకు సినిమాల మీద ఉన్నంత ΄్యాషన్ నేను ఇంకో ్ర΄÷డక్షన్‌లో చూడలేదు. శివ నిర్వాణగారు ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తుంటారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment