viplav
-
టీజర్, సాంగ్స్ నచ్చితే మా సినిమా ఎంకరేజ్ చేయండి: హీరో
విప్లవ్ దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రను పోషిస్తున్న ఈ సినిమా 'ఈసారైనా'. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న ఓ నిరుద్యోగి అతడి ప్రేమను వెతుక్కునే దిశగా ఎలా సాగుతాడనేది కథ. విప్లవ్ నిర్మాతగా, సంకీర్త్ సహనిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ నవంబర్ 8 న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విప్లవ్ మాట్లాడుతూ.. "ఈ సినిమా మీ అందరి ముందుకు రావడానికి కారణం సంకీర్త్ అన్న. ఆయన ముందు నుంచి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు. ఈ సినిమాకి నేనే నిర్మాతను. కష్టమైనా సరే అన్నింటినీ మేనేజ్ చేశాను. టీజర్, సాంగ్స్ చూడండి. నచ్చితే సినిమా చూడండి" అన్నారు.హీరోయిన్ అశ్విని మాట్లాడుతూ.. ఈ సినిమాకు షూటింగ్ చేస్తున్నన్ని రోజులు సమ్మర్ హాలిడేస్లా అనిపించాయి. నా ఫస్ట్ మూవీకి ఇలాంటి క్యారెక్టర్ రావడం సంతోషంగా ఉంది అని తెలిపింది. చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ మాట్లాడుతూ.. విప్లవ్ అన్న నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థాంక్స్. సలార్ తర్వాత ఇష్టంగా చేసిన సినిమా ఇదే" అన్నాడు.కో ప్రొడ్యూసర్ సంకీర్త్ మాట్లాడుతూ, "నా దృష్టి లో చిన్న సినిమా, పెద్ద సినిమా అంటూ ఏమీ ఉండదు. నా దృష్టిలో ఒక సినిమా మనతో పాటు ఇంటికి వచ్చిందంటే అది అందరికీ నచ్చుతుంది. నవంబర్ 8 న థియేటర్స్‌లో ఈ సినిమా చూడొచ్చు" అన్నారు. -
ఈసారైనా మూవీ టీమ్ ఇంటర్వ్యూ
-
నా సోదరి పార్టీకి వెన్నుపోటు పొడిచింది
సాక్షి, హైదరాబాద్: పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అధినేత కేసీఆర్‌కు అండగా నిలవాల్సిన తన తండ్రి కె. కేశవరావు (కేకే) పార్టీని వీడటం బాధాకరమని ఆయన కుమారుడు, బీఆర్ఎస్ నేత విప్లవ్ కుమార్ పేర్కొన్నారు. పార్టీ నేత దాసోజు శ్రవణ్‌తో కలసి శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌ను వీడిన సమయంలో దుర్భాషలాడిన సీఎం రేవంత్‌రెడ్డి తన తండ్రిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. పార్టీ అధికారం కోల్పోయిన నేపథ్యంలో కేడర్‌లో ఆత్మస్థై ర్యం నింపేందుకు కేకే తన నిర్ణయాన్ని పునఃసమీ క్షించుకోవాలని సూచించారు. అలాగే తన సోదరి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి.. పార్టీకి వెన్ను పోటు పొడిచిందని విప్లవ్ మండిపడ్డారు. ఆమెకు మేయర్ పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని గుర్తు చేశారు. తన తండ్రి, సోదరి బీఆర్ఎస్ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో కి వెళ్లాలని డిమాండ్ చేశారు. అభివృద్ది కోసమే కాంగ్రెస్‌లోకి వెళ్తున్నానంటూ తన సోదరి చేసిన వ్యా ఖ్యలను విప్లవ్ తప్పుబట్టారు. కాంగ్రెస్‌లో చేరకుంటే విపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలను సీఎం అభివృద్ధి చేయరా? అని ప్రశ్నించారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్తపై ఉందని... ఎట్టిపరిస్థితుల్లోనూ తాను బీఆర్ఎస్ను వీడేది లేదని విప్లవ్ స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి తమ కుటుంబాన్ని చీల్చుతున్నాడని తానూ ఆరోపణలు చేయగలనని పేర్కొన్నారు. దానం.. ఆత్మగౌరవం ఇప్పుడు గుర్తుకొచ్చిందా?: దాసోజు బీఆర్ఎస్లో ఆత్మగౌరవం లేదని తమ పార్టీ ఖైర తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యానించడాన్ని ఆ పార్టీ నేత దాసోజు శ్రవణ్ తప్పుబ ట్టారు. ఎన్నికల ప్రచారంలో తీవ్రంగా అవమానించిన రేవంత్‌రెడ్డి దగ్గర ఆత్మగౌరవం దొరుకుతుందా? అని ప్రశ్నించారు. దానం ఎన్నోమార్లు కేసీఆర్ కు పాదాభివందనం చేశారని, ఆయన ఆత్మగౌరవా న్ని కించపరిస్తే ఎందుకు కాళ్లు మొక్కారని నిలదీ శారు. బాత్రూంలో జారిపడటంతో ఆసుపత్రిపా లైన కేసీఆర్ తాత్కాలికంగా ఉండేందుకు తన ఇళ్లను ఇచ్చేందుకు దానం ముందుకొచ్చారన్నారు. కేశవరావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ తమ పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరాలని దాసోజు డిమాండ్ చేశారు. లౌకికవాదం కోసమే తాను కాంగ్రెస్‌లో చేరినట్లు దానం చెప్పడాన్ని పెద్ద జోక్‌గా ఆయన అభివర్ణించారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు మన్నె గోవర్దన్‌రెడ్డి, బైండ్ల విజయ్‌కుమార్, నారాయణ పాల్గొన్నారు. -
ఆ సీన్స్‌ని కాపీ కొట్టలేదు
‘‘లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘ఖుషి’ సినిమా ఉంటుంది. విప్లవ్, ఆరాధ్య పాత్రల్లో విజయ్ దేవరకొండ, సమంతల నటన, భావోద్వేగాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. ఒక్క మాటలో చె΄్పాలంటే ‘ఖుషి’లో అన్ని వాణిజ్య అంశాలుంటాయి’’ అని ఛాయాగ్రాహకుడు జి. మురళి అన్నారు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఖుషి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జి. మురళి మాట్లాడుతూ– ‘‘సినిమాటోగ్రఫీలో శిక్షణ ΄÷ంది, సినిమాల్లోకి వచ్చాను. ఎవరి వద్దా అసిస్టెంట్‌గా చేయలేదు. తెలుగులో నా తొలి సినిమా ‘అందాల రాక్షసి’. ఆ తర్వాత ‘ఖుషి’నే. ప్రేమ గురించి కలలు కనే యువకుడికి ప్రేమ, జీవితం అంటే మన ఊహలకు అనుగుణంగా ఉండవని తెలిసి రావడమే ఈ సినిమా నేపథ్యం. మణిరత్నంగారి సినిమాల్లో సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్‌గారు చూపించే విజువల్ బ్యూటీ ‘ఖుషి’లో చూస్తారు. అయితే అలాంటి సీన్స్‌ను మేం కాపీ కొట్టలేదు.. అలాంటి అనుభూతి కలిగించేలా విజువల్స్ ఉంటాయి. ఈ సినిమా పూర్తయ్యాక ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలుగుతుంది. కెమేరా ద్వారా ఆ ఎమోషన్ని తీసుకొచ్చేందుకు నా ప్రయత్నం చేశాను. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్‌గార్లకు సినిమాల మీద ఉన్నంత ΄్యాషన్ నేను ఇంకో ్ర΄÷డక్షన్లో చూడలేదు. శివ నిర్వాణగారు ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తుంటారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు’’ అన్నారు. -
'గుండె నిండా గుడి గంటలు' స్టిల్స్