బీఆర్‌ఎస్ కష్టాల్లో ఉన్నప్పుడు నా తండ్రి పార్టీని వీడటం బాధాకరం
పదవులకు వారిద్దరూ రాజీనామా చేసి వెళ్లాలి
బీఆర్‌ఎస్‌ను వీడను: విప్లవ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అధినేత కేసీఆర్‌కు అండగా నిలవాల్సిన తన తండ్రి కె. కేశవరావు (కేకే) పార్టీని వీడటం బాధాకరమని ఆయన కుమారుడు, బీఆర్‌ఎస్ నేత విప్లవ్ కుమార్ పేర్కొన్నారు. పార్టీ నేత దాసోజు శ్రవణ్‌తో కలసి శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌ను వీడిన సమయంలో దుర్భాషలాడిన సీఎం రేవంత్‌రెడ్డి తన తండ్రిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. పార్టీ అధికారం కోల్పోయిన నేపథ్యంలో కేడర్‌లో ఆత్మస్థై ర్యం నింపేందుకు కేకే తన నిర్ణయాన్ని పునఃసమీ క్షించుకోవాలని సూచించారు.
అలాగే తన సోదరి, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి.. పార్టీకి వెన్ను పోటు పొడిచిందని విప్లవ్ మండిపడ్డారు. ఆమెకు మేయర్ పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని గుర్తు చేశారు. తన తండ్రి, సోదరి బీఆర్‌ఎస్ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో కి వెళ్లాలని డిమాండ్ చేశారు. అభివృద్ది కోసమే కాంగ్రెస్‌లోకి వెళ్తున్నానంటూ తన సోదరి చేసిన వ్యా ఖ్యలను విప్లవ్ తప్పుబట్టారు. కాంగ్రెస్‌లో చేరకుంటే విపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలను సీఎం అభివృద్ధి చేయరా? అని ప్రశ్నించారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్తపై ఉందని... ఎట్టిపరిస్థితుల్లోనూ తాను బీఆర్‌ఎస్‌ను వీడేది లేదని విప్లవ్ స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి తమ కుటుంబాన్ని చీల్చుతున్నాడని తానూ ఆరోపణలు చేయగలనని పేర్కొన్నారు.
దానం.. ఆత్మగౌరవం ఇప్పుడు గుర్తుకొచ్చిందా?: దాసోజు
బీఆర్‌ఎస్‌లో ఆత్మగౌరవం లేదని తమ పార్టీ ఖైర తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యానించడాన్ని ఆ పార్టీ నేత దాసోజు శ్రవణ్ తప్పుబ ట్టారు. ఎన్నికల ప్రచారంలో తీవ్రంగా అవమానించిన రేవంత్‌రెడ్డి దగ్గర ఆత్మగౌరవం దొరుకుతుందా? అని ప్రశ్నించారు. దానం ఎన్నోమార్లు కేసీఆర్ కు పాదాభివందనం చేశారని, ఆయన ఆత్మగౌరవా న్ని కించపరిస్తే ఎందుకు కాళ్లు మొక్కారని నిలదీ శారు. బాత్రూంలో జారిపడటంతో ఆసుపత్రిపా లైన కేసీఆర్ తాత్కాలికంగా ఉండేందుకు తన ఇళ్లను ఇచ్చేందుకు దానం ముందుకొచ్చారన్నారు. కేశవరావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ తమ పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరాలని దాసోజు డిమాండ్ చేశారు. లౌకికవాదం కోసమే తాను కాంగ్రెస్‌లో చేరినట్లు దానం చెప్పడాన్ని పెద్ద జోక్‌గా ఆయన అభివర్ణించారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నేతలు మన్నె గోవర్దన్‌రెడ్డి, బైండ్ల విజయ్‌కుమార్, నారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment