మాతృత్వం దేవుడు ప్రసాదించిన గొప్పవరం: ఐశ్వర్యరాయ్
మాతృత్వం దేవుడు ప్రసాదించిన గొప్పవరం: ఐశ్వర్యరాయ్
Published Tue, Oct 8 2013 1:53 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
మాతృత్వం తనకు దేవుడు ప్రసాదించిన గొప్ప వరం అని మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ అన్నారు. జీవితంలో మార్పు సహజం అని.. ప్రతి అనుభవం వ్యక్తిగతంగా బలపడటానికి.. మంచి మనిషిగా మారడానికి తోడ్పాటును అందిస్తాయన్నారు. తల్లిగా మారడం తనకు దేవుడు ప్రసాదించిన గొప్ప వరమే కాకుండా మధురమైన జ్క్షాపకం అని ఐశ్వర్య తెలిపింది. తమ జీవితాల్లోకి తన కూతురు ఆరాధ్య రావడం గొప్ప అనుభూతి, ఓ ప్రత్యేకమైన అనుభవం అన్నారు.
ముంబైలో లైఫ్ సెల్ అనే జీవ కణ నిధి (స్టెమ్ సెల్ బ్యాంకింగ్ ) శాఖను ఆరంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐశ్వర్యరాయ్ పాల్గొన్నారు. తన కూతురు ఆరాధ్య కు చెందిన జీవకణాలను భద్ర పరిచానని ఆమె తెలిపారు. వైద్యులు, స్నేహితుల ద్వారా వైద్యరంగంలో జీవకణాలను భద్రపరిచే విషయాన్ని పెళ్లికి ముందే తెలుసుకున్నానని ఐశ్వర్య ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
Advertisement
Advertisement