
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గల్లంతు
ఖమ్మం జిల్లాలోని బొగత జలపాతం వద్ద శనివారం ఓ విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి జలపాతాన్ని వీక్షించడానికి వెళ్లిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రమాదవశాత్తు జలపాతంలో పడి గల్లంతయ్యాడు. ఇది గమనించిన స్నేహితులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ను కాపాడేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇంజనీర్ మృతదేహం కోసం జలపాతం వద్ద గాలింపు చర్యలు చేపట్టారు.