వరంగల్: ములుగును ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్‌తో వివిధ రాజకీయ పక్షాలు చేపట్టిన ర్యాలీ గురువారం ఉద్రిక్తతకు దారితీసింది. ములుగు నుంచి వివిధ రాజకీయపక్షాల నాయకులు కలసి వరంగల్ కలెక్టరేట్ ముట్టడికి ర్యాలీగా బయలుదేరారు.
వారి ర్యాలీని వరంగల్ ఏకశిలా పార్కు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఆ క్రమంలో రాజకీయ పక్షాల నేతలు, పోలీసుల వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.