
మాట్లాడుతున్న సత్యనారాయణరావు
భూపాలపల్లి: స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముమ్మాటికీ భూకబ్జాదారుడే అని, తాము నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని దమ్ముంటే భూపాలపల్లి పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్‌లో బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గండ్ర సత్యనారాయణరావు సవాల్ విసిరారు. డీసీసీ అధ్యక్షుడు అయిత ప్రకాశ్‌రెడ్డితో కలిసి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో సత్యనారాయణరావు మాట్లాడారు. ఆస్తులు కాపాడుకోవడం కోసమే ఎమ్మెల్యే గండ్ర కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరారన్నారు. నిన్న జరిగిన మంత్రి కేటీఆర్ బహిరంగ సభలో కాంగ్రెస్ నినాదాలు వినపడలేదా అని ప్రశ్నించారు. సభలో తమ భూములను ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని పలువురు మహిళలు గోడు వెళ్లబోసుకున్నారని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంతర్‌రెడ్డిని విమర్శించే అర్హత మంత్రి కేటీఆర్‌కు లేదన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ సభ్యుడు చల్లూరి మధు, నాయకులు ఇస్లావత్ దేవన్, దాట్ల శ్రీనివాస్, భువనసుందర్, బట్టు కర్ణాకర్, పుప్పాల రాజేందర్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర భూకబ్జాదారుడే
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గండ్ర సత్యనారాయణరావు
Comments
Please login to add a commentAdd a comment