రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి | Three die in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి

Published Thu, Dec 10 2015 4:42 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Three die in road accident

ములుగు (మెదక్ జిల్లా) : ములుగు స్టేజి సమీపంలో రాజీవ్ రహదారిపై ముందు వెళ్తున్న ఆటోను క్వాలిస్ వాహనం ఢీకొట్టింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో శంకర్ గౌడ్(38), రేణుక(30) అనే దంపతులతో పాటు మధు(25) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా..మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఆటో నుజ్జునుజ్జయింది. క్షతగాత్రులను గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement