
ప్రజలతో మాట్లాడుతున్న సునీల్‌రెడ్డి
కాటారం: ప్రజలు ఓటు వేసి ఆశీర్వదిస్తే సేవకుడిలా పనిచేస్తానని బీజేపీ రాష్ట్ర నాయకుడు చంద్రుపట్ల సునీల్‌రెడ్డి అన్నారు. మంథని గోస బీజేపీ భరోసా పేరిట చంద్రుపట్ల సునీల్‌రెడ్డి చేపట్టిన ప్రజా చైతన్యయాత్ర గురువారం కాటారం మండలం గారెపల్లి, ప్రతాపగిరి, బయ్యారం, నస్తూర్‌పల్లి, మేడిపల్లి గ్రామాల్లో కొనసాగింది. సునీల్‌రెడ్డి ఇంటింటా తిరిగి ప్రజలను పలకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తుందని అన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలు అని వాటిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని విమర్శించారు. మంథని ప్రజలను చైతన్యం చేయడం కోసమే ఈ యాత్ర చేపడుతున్నట్లు సునీల్‌రెడ్డి తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన పాత్రికేయుడు మెండ మల్లేశ్‌ను సునీల్‌రెడ్డి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బొమ్మన భాస్కర్‌రెడ్డి, దుర్గం తిరుపతి, ఉడుముల విజయారెడ్డి, పూసాల రాజేంద్రప్రసాద్, పాగె రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నేడు బండి సంజయ్ రాక..
కాటారం మండల కేంద్రానికి నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రానున్నారు. సునీల్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర 200 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ముఖ్య కార్యకర్తల, బూత్ లెవల్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జి. వివేక్ హాజరుకానున్నారు.
బీజేపీ రాష్ట్ర నాయకుడు
చంద్రుపట్ల సునీల్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment