ములుగును జిల్లా చేయాలని ధర్నా, రాస్తారోకో
Published Wed, Sep 7 2016 12:08 AM | Last Updated on Tue, Oct 16 2018 8:42 PM
ములుగు : ములుగును జిల్లా చేయాలని కోరుతూ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో సోమవారం జా తీయ రహదారిపై వినాయక విగ్రహాలు, ట్రాక్టర్స్, టాటా ఏసీలతో ధర్నా, రాస్తారోకో నిర్వహిం చారు. దీంతో కిలోమీటర్ల మేరా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఎస్సై సూర్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనను విరమింపజేశారు. ఈ సందర్బంగా జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల భిక్షపతిగౌడ్ మాట్లాడుతూ ములుగును జిల్లాగా సాధిం చుకునేంత వరకు ఉద్యమాలను విరమించే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని ఆరోపించారు. కార్యక్రమంలో ఏబీ వీపీ నాయకులు నాగపూరి రమేశ్, ఇమ్మడి రాకేశ్, కిష న్, రమేశ్, రఘు,నూనె శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.
టీడీపీ ఆధ్వర్యంలో
టీడీపీ ఆధ్వర్యంలో జాకారం జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు పల్లె జయపాల్‌రెడ్డి మాట్లాడుతూ ములుగును జి ల్లా చేయాలని రెండేళ్లుగా ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టిం చుకోకపోవడం బాధకరమన్నారు. కార్యక్రమంలో గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ.లాల్‌పాషా, ముదాం వేణు, నాయకులు వెంకటేశ్వర్లు, తిరుపతి, రఘుపతి, రాజు, రాణాప్రతాప్, పాప య్య, కనకయ్య, శంకర్, రమేశ్, రవిలు పాల్గొన్నారు.
విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో
విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ప్రభు త్వ జూనియర్ కళాశాల ఎదుట సుమారు 500 మంది విద్యార్థులతో జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు రమేశ్, కిషన్, నరేశ్, రాకేశ్, సాయి, శేశి, దేవేందర్, కిరణ్, మితున్, రవి, ఇంద్రసేనారెడ్డిలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement