
రిజిస్టర్‌ను పరిశీలిస్తున్న పీఓ అంకిత్
విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ఐటీడీఏ పీఓ అంకిత్
వెంకటాపురం(ఎం): విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ అంకిత్ అన్నారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన గురువారం తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. స్కూల్ బ్యాగులు, యూనిఫాంలపై ఆరాతీశారు, మెనూ ప్రకారం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం అందించడంతో పాటు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. మార్గ దర్శకాల ప్రకారం మెనూ అమలుచేయాలని చెప్పారు. సిలబస్ టైం టేబుల్‌ను సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు.
పీహెచ్‌సీ తనిఖీ..
వెంకటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పీఓ తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం ల్యాబొరేటరీని తనిఖీ చేసి, సెల్ కౌంటర్ పనితీరు, పరీక్ష నిర్వహణ, డెంగ్యూ, మలేరియా టెస్టింగ్ కిట్‌ల లభ్యత మొదలైన వాటిపై ఆరాతీశారు. మందుల లభ్యత, ఆవాసాలు, పాఠశాలల్లో వైద్య శిబిరాలు, ఏఎన్‌ఎం, ఆశకార్యకర్తల పనిపై ఆరాతీశారు. 108 వాహనాల్లో కాల్స్ స్వీకరించడం, సకాలంలో స్పందించడం, వాహనంతో అందుబాటులో ఉన్న అత్యవసర మందులు మొదలైన వాటిపై ఫస్ట్ రెస్పాండర్ అంబులెన్స్, మొబైల్ అంబులెన్స్ పైలట్‌ను విచారించి, ప్రతి కాల్‌కు అందుబాటులో ఉండి ప్రతిస్పందించి ఉత్తమ వైద్య సదుపాయాలు అందించాలని ఆదేశించారు.
నేడు రాజగోపురం
ప్రారంభోత్సవం
గీసుకొండ: సుప్రసిద్ధ కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం కొత్త శోభను సంతరించుకుంది. ఆలయాభివృద్ధికి ఎందరో దాతలు ముందుకొచ్చి సహకారం అందించగా.. గత ఏడాది అక్టోబర్‌లో పలువురు దాతలు రాజగోపుర నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రభుత్వం, దేవాదాయ శాఖ, ప్రజాప్రతినిధుల నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం లేనప్పటికీ కేవలం దాతలు ముందుకొచ్చి ఇంత పెద్ద గోపురం నిర్మాణాన్ని పూర్తి చేయడం విశేషం. శుక్రవారం శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాధ రామానుజ జీయర్‌స్వామి రాజగోపురాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే రంగులు వేసి పనులన్నీ పూర్తి చేశారు. రాజగోపురం ప్రారంభోత్సవానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, జెడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment