
సమావేశంలో మాట్లాడుతున్న పీఓ అంకిత్
ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలో కొత్తగా మంజూరైన 14 ఎంఎస్‌ఎం యూనిట్లపై శనివారం పీఓ అంకిత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐటీడీఏ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐటిడీఏ పరిధిలో మంజూరైన కన్‌స్ట్రక్షన్స్ నాలుగు, ఫిషరీస్ నాలుగు, దల్‌మిల్ రెండు, టైలరింగ్, లాండ్రి, మొవ్వ ప్లవర్, హార్టికల్చర్, వెజిటబుల్ యూనిట్లపై డిటేల్ రిపోర్టు తయారు చేసి వచ్చే వారంలోపు అందజేయాలని అధికారులను కోరారు. గతంలో మంజూరైన కన్‌స్ట్రక్షన్స్ రిలేటెడ్ యూనిట్స్ గ్రౌండింగ్ వచ్చే గురువారం లోపు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ వసంతరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment