
ఎంపికై న సాయికీర్తన, మన్విత
ఏటూరునాగారం: రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీలకు మండల కేంద్రానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికై నట్లు ఏటూరునాగారం స్పోర్ట్స్ క్లబ్ కోచ్ పర్వతాల కుమారస్వామి శుక్రవారం తెలిపారు. ములుగు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీన టీఎస్ డబ్ల్యూఆర్‌ఎస్ జాకారంలో నిర్వహించిన జిల్లా యూత్ అథ్లెటిక్స్ పోటీల్లో ఏటూరునాగారం స్పోర్ట్స్ క్లబ్ క్రీడాకారులు పి.సాయికీర్తన, ఎం.మన్విత ఉత్తమ ప్రతిభ కనబర్చి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు వెల్లడించారు. ఈ క్రీడాకారులు ఈనెల 25, 26వ తేదీల్లో హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని కుమారస్వామి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment