
7వ వార్డులో పేరుకుపోయిన మురుగునీరు
ఏటూరునాగారం: జిల్లాలో వేగంగా అభివృద్ధి ప్రాంతాల్లో ఏటూరునాగారం ఒకటి. కానీ, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల తీరుతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా మారింది.. ఏటూరునా గారం పరిస్థితి. ఇంత పెద్ద ఏటూరునాగారంలో చెత్తాచెదారం పేరుకుపోయి కనిపిస్తోందని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గత నెలలో ఏటూరునాగారం వచ్చిన సందర్భంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులపై మండిపడ్డారు. దీంతో ప్రజాప్రతినిధి కాంగ్రెస్ పార్టీలో నుంచి బీఆర్‌ఎస్ లోకి వచ్చారని స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు మంత్రికి తెలిపారు. అయితే ఏమిటి.. మన పార్టీ వేరే పా ర్టీ కాదు.. ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజ ల కోసం పనిచేయాలి. చెత్తాచెదారం లేకుండా చూ డాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఒక మంత్రి చెప్పినప్పటికీ ఎక్కడిచెత్తా అక్కడే దర్శమివ్వడం గమనార్హం. అంతేకాకుండా వార్డు సభ్యులకు చెత్తాచెదారం తొలగించే కాంట్రాక్టులు అప్పగించి వేలాది రూపాయలను డ్రా చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవేకాకుండా ఇటీవల దసరా ఉత్సవాల్లో ప్రజల నుంచి చందాలు వసూలు చేసిన పనులకు కూడా గ్రామ పంచాయతీ నుంచి బిల్లులు పెట్టినట్లుగా సమాచారం. జీపీ పరిధిలోని 16 వార్డుల్లో చెత్తాచెదారం ఎత్తిపారేసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి ప్రజాప్రతినిధులు, సభ్యులు సంబుర పడుతున్నారే తప్ప ఎలాంటి మార్పు లేదని స్థానికులు పేర్కొంటున్నారు.
ఫేక్ బిల్స్‌తో రూ.10లక్షలు డ్రా?
మేజర్ గ్రామ పంచాయతీలో పనులు జరగకుండానే జరిగినట్లుగా ఫేక్ బిల్లులు సృష్టించి, రూ.10లక్షలు డ్రా చేసినట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో ఇక్కడ పనిచేసిన పంచాయతీ కార్యదర్శి, ప్రజాప్రతినిధులు కలిసి ఈ ఫేక్ బిల్స్ సృష్టించినట్లు వినికిడి. దీనిపై పలువురు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం.
మంత్రి మందలించినా
నిష్ప్రయోజనమే..
ఫేక్ బిల్స్‌తో గ్రామ పంచాయతీలో రూ.10లక్షలు డ్రా
బదిలీ అయిన కార్యదర్శిపై ఆరోపణలు
´ë™èl ¼Ë$Ï-Ë$ Ð]l*{™èlÐól$ {yé ^ólÔ>…
గతంలో పంచాయతీ కార్యదర్శిగా ఉన్న క్రమంలో జీపీ మెయింటనెన్స్ కోసం ఖర్చు చేసిన వాటికి మాత్రమే బిల్స్ పెట్టి డ్రా చేయడం జరిగింది. ఎలాంటి ఫేక్ బిల్స్ పెట్టలేదు. సభ్యులకు తెలిసే ఖర్చులు చేశాం. దసరా ఉత్సవాలకు కూడా జీపీ నుంచి ఖర్చు చేసిన వాటికి మాత్రమే ఎంబీ రికార్డు చేయిస్తున్నాం. ఎలాంటి తప్పుడు లెక్కలు లేవు.
– ఈసం రామ్మూర్తి, సర్పంచ్, ఏటూరునాగారం

ఏటూరునాగారం జీపీ కార్యాలయం
Comments
Please login to add a commentAdd a comment