
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీపై ఆదాయ పన్నుశాఖ కొరడా ఝుళిపించింది. పలుసార్లు డిమాండ్ నోటీసులు ఇచ్చినా యూనివర్సిటీ అఽధికారులు (2016–2017, 2017–2018, 2018–2019 అంచనా సంవత్సరాలు) ఆదాయ వ్యయాలను ఆడిట్ రిటర్స్ దాఖలు చేయలేదు. దీంతో రూ.200 కోట్లకు డిమాండ్ నోటీస్ ఇచ్చిన ఆదాయపన్నుశాఖ, అందులో 20శాతం చొప్పున రూ.40కోట్లు ట్యాక్స్ చెల్లించాలని, లేనిపక్షంలో యూనివర్సిటీ అకౌంట్స్ సీజ్ చేస్తామని ఇటీవల హెచ్చరిస్తూ డిమాండ్ నోటీసును కూడా జారీ చేసినట్లు సమాచారం. దీంతో యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేష్, రిజిస్ట్రార్ శ్రీనివాస్‌రావులు హైదరాబాద్‌కు వెళ్లి ఆదాయపన్నుశాఖ అధికారులను కలిసినట్లు తెలిసింది. యూనివర్సిటీకి ఆదాయ పన్నునుంచి మినహాయింపు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అందుకు ఆ శాఖ అధికారులు నిరాకరించారని, డిమాండ్ నోటీస్ ఇచ్చినట్లుగా అందులో కొంత మొత్తం చెల్లించాల్సిందేనని చెప్పినట్లు సమాచారం. ఆ తరువాత స్టే కోరుతూ ఒక విజ్ఞాపనను రాష్ట్ర ఆదాయపన్నుశాఖకు యూనివర్సిటీ అధికారులు సమర్పించారు. దీంతో ఈ నెల 23న స్టేను మంజూరు చేస్తూనే మార్చి 7వ తేదీ లోపు రూ.25 కోట్లు (12.5శాతం)టాక్స్ చెల్లించాలని రెండో డిమాండ్ నోటీస్ ఇచ్చారు. రూ.25కోట్లు పన్నును చెల్లిస్తేనే సెప్టెంబర్ 30 వరకు స్టే కొనసాగింపు వర్తిస్తుంది.
ఫీజు మీరే చెల్లించుకోండి : వీసీ
కాకతీయ యూనివర్సిటీలోని వివిధ కార్యాలయాలు విభాగాల్లో, కళాశాలల్లోని ప్రిన్సిపాల్స్, డ్రాయింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌లతో గత శుక్రవారం సెనేట్‌హాల్‌లో అత్యవసర సమావేశం నిర్వహించారు. మీ పరిధిలోని ఆదాయవ్యయాలను, ఖాతాలను చార్టడ్ అకౌంటెంట్ ద్వారా ఆడిట్ చేయిచుకోవాలని 28 వరకు పూర్తిచేసుకోవాలని ఆదేశించారు. పారదర్శకంగా నిర్వహించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
తొలుత రూ.25 కోట్లు చెల్లించాలని అల్టిమేటం
మార్చి 7వ తేదీ వరకు డెడ్‌లైన్
వర్సిటీ వీసీ నిర్లక్ష్యం వల్లేనని చర్చ
Comments
Please login to add a commentAdd a comment