
వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీఓ అంకిత్
ములుగు: జీఓ నంబర్ 58, 59 ఆధారంగా భూమి రుసుమును విడతల వారీగా వసూలు చేసి ప్రొఫార్మా– 1 ప్రకారం వివరాలను మరోసారి పరిశీలించి మార్చి చివరి కల్లా అర్హులైన వారికి పట్టాలు పంపిణీ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులకు సూచించారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కంటి వెలుగు, భూముల క్రమబద్దీకరణ, పోడు భూములు, ఆయిల్ పామ్ సాగుపై మున్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్‌తో కలిసి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ.. కంటి వెలుగు పరీక్షలు చేయించుకున్న వారి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అన్నారు. అవసరం అయిన వారికి అద్దాలు అందించాలని చెప్పారు. క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. కలెక్టర్ కృష్ణ ఆదిత్య నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల స్క్రూటీని మూడు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. పోడు భూముల పంపిణీ విషయంలో జిల్లా స్థాయి కమిటీ వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అన్నారు. ఆమోదించబడిన పట్టాలను డౌన్‌లోడ్ చేసి మరోసారి చూసుకోవాలని తెలిపారు. పట్టాల పంపిణీకి కార్యచరణ సిద్ధం చేసుకోవాలని అన్నారు. నిర్ణయించిన లక్ష్యం మేరకు అయిల్ పామ్ సాగు జరిగేలా చూడాలని, ఎంపిక చేసిన భూముల్లో అధికారులు డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. హరితహారంలో భాగంగా నాటేందుకు నర్సరీలను సిద్ధం చేసి మొక్కలు పెంచాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ అంకిత్, డీఎఫ్‌ఓ కృష్ణ గౌడ్, అదనపు కలెక్టర్(రెవెన్యూ) వైవీ గణేశ్, డీఆర్వో రమాదేవి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్, డీఏఓ గౌస్ హైదర్, ఉద్యానశాఖ అధికారి బీవీ రమణ, పవన్‌కుమార్, సారంగపాణి, తదితరులు పాల్గొన్నారు.
ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని
చేరుకోవాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో
సీఎస్ శాంతికుమారి
Comments
Please login to add a commentAdd a comment