
సాక్షి, భూపాలపల్లి : మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన టీఆర్‌ఎస్ అభ్యర్థి భర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. పట్టణంలోని 5వ వార్డు నుంచి టీఆర్‌ఎస్ తరపున పోటీచేసిన సింగనవేన విజేత ఓటమిపాలయ్యారు. దీంతో ఆమె భర్త చిరంజీవి పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రాణాపాయం ఏమి లేదని వైద్యులు వెల్లడించారు. సంఘటన తెలిసిన అనంతరం మాజీ స్పీకర్, వరంగల్ రూరల్ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి బాదితుడిని పరామర్శించారు. కాగా 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరపున పోటీ చేసి చిరంజీవి ఓడిపోగా.. ఈసారి కూడా 78 ఓట్ల తేడాతో ఆయన భార్య ఓడిపోయారు. ఎన్నికల కోసం గతంలో రూ. 8 లక్షలు, ప్రస్తుతం రూ. 15 లక్షలు ఖర్చు చేసినట్లు సన్నిహితులు చెబుతున్నారు.