భార్యకు దెయ్యం పట్టిందని.. మాంత్రికుడితో భర్త.! | husband beats his wife with megician | Sakshi
Sakshi News home page

భార్యకు దెయ్యం పట్టిందని.. మాంత్రికుడితో భర్త.!

Published Fri, Jan 19 2018 9:25 PM | Last Updated on Tue, Aug 21 2018 6:21 PM

husband beats his wife with megician - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ ‌: అక్రమ సంబందాన్ని రట్టుచేసిన ఓ భార్య పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించగా భార్యను బాగా చూసుకుంటానని చెప్పాడు ఓ షాడిస్టు భర్త.  కొంతకాలానికి తన భార్యకు ఆరోగ్యం బాగుండడం లేదని, దెయ్యం పట్టిందని చెప్పి మాంత్రికుడితో పూజలు చేయించి ఆమెకు ఎక్కడపడితే అక్కడ వాతలు, గాయాలు పెట్టించాడు. ఈ సంఘటన శామీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది.

పోలీసులు, భాదితురాలి కథనం ప్రకారం శామీర్‌పేట మండలం బొమ్మరాశిపేట గ్రామానికి చెందిన కంచుగంట్ల నాగేశ్‌తో గత 10 సంవత్సరాల క్రితం కంచుగంట్ల మంగ(26)కు వివాహనం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. కాగా గత 5 సంవత్సరాలుగా నాగేశ్‌  శ్రీలత అనే మహిళతో అక్రమ సంబందం పెట్టుకుని భార్య మంగను శారీరకంగా, మానసికంగా వేదించడం మొదటు పెట్టాడు. దీంతో భర్త అక్రమ సంబందాన్ని తెలుసుకుని  పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించింది. పంచాయతీ పెద్దలు నాగేశ్‌ను మందలించడంతో భార్య మంగను బాగా చూసుకుంటానని ఒప్పుకున్నాడు. భార్య పంచాయతీ పెట్టిదన్న పగతో ఉన్న నాగేశ్‌ గత నెల రోజుల కిందట ఇంట్లో ఉన్న పిండి పదార్ధాల్లో భార్య మంగకు తెలియకుండా భాస్వారం(మత్తు పదార్ధాలు) కలుగపగా వంట చేసే సమయంలో గమనించి వాటిని బయట పడేసింది.

దీంతో తన భార్య మంగకు పిచ్చిపట్టి ఇంట్లో వస్తువులను బయట పారేస్తుందంటూ గ్రామంలో అందరికి చెబుతూ వేదించడం మొదలు పెట్టాడు. కాగా ఈ నెల 18న ఉదయం తన పుట్టింటికి వెళ్లివస్తానని మంగ తన భర్త నాగేశ్‌ను అడగగా ఎక్కడికి వెళ్లేది లేదని తేల్చి చెప్పాడు. అనంతరం తనకు తెలిసిన ఓ మాంత్రికుడిని ఇంటికి తీసుకువచ్చాడు. మాంత్రికుడు ఇంట్లో ముగ్గు వేశారు. మంగకు బలవంతంగా మత్తు ట్యాబ్లెట్స్‌ వేసి ముగ్గు వద్ద కూర్చోవెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement