మహిళపై లైంగికదాడికి మాంత్రికుడి యత్నం | - | Sakshi
Sakshi News home page

మహిళపై లైంగికదాడికి మాంత్రికుడి యత్నం

Published Wed, May 17 2023 9:16 AM | Last Updated on Wed, May 17 2023 3:49 PM

- - Sakshi

రేణిగుంట : చేతబడి అనుమానంతో తన వద్దకు వచ్చిన మహిళను ఓ మాంత్రికుడు నగ్నంగా పూజలో పాల్గొనాలంటూ బలవంతం పెట్టాడు. మాట వినకపోవడంతో ఆమైపె లైంగిక దాడికి యత్నించాడు. కామాంధుడి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పరారైన మాంత్రికుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ తారకరామానగర్‌లో జరిగింది. ఈ వివరాలను రేణిగుంట అర్బన్‌ సీఐ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు.

తారకరామానగర్‌కు చెందిన 35 ఏళ్ల మహిళకు ఇటీవల అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఆస్పత్రులకు వెళ్లినా తగ్గకపోవడంతో.. తనకు ఎవరైనా చేతబడి చేశారేమోనని ఆందోళన చెందింది. దీంతో వారం కిందట శ్రీకాళహస్తి పట్టణం బహదూర్‌పేటకు చెందిన మాసారపు సుబ్బయ్య వద్దకు వెళ్లింది. ఇంటికి చేతబడి జరిగిందని.. రూ.20 వేలు ఇస్తే క్షుద్రపూజలు చేసి విముక్తి కల్పిస్తానంటూ ఆమెను సుబ్బయ్య నమ్మబలికాడు. రూ.7,500 అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. ఈనెల 14వ తేదీన రాత్రి 10 గంటలకు సుబ్బయ్య కారులో ఆమె ఇంటికి పూజా సామగ్రిని తీసుకువచ్చాడు.

ఇంట్లోనే ముగ్గులు వేసి.. గుంతలు తవ్వి కొబ్బరికాయలు, నిమ్మకాయలు పెట్టాడు. ముగ్గుపై నగ్నంగా కూర్చుంటే పూజ ప్రారంభిస్తానని చెప్పగా.. అవాక్కయిన ఆ మహిళ నిరాకరించింది. దీంతో ఆమైపె సుబ్బయ్య లైంగిక దాడికి యత్నించాడు. బయటకు వచ్చేందుకు ఆమె పెనుగులాడుతుండటంతో.. చాకుతో పొడిచేందుకు ప్రయత్నించాడు. సుబ్బయ్యను తోసేసిన బాధితురాలు గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది.

చుట్టుపక్కల వాళ్లు అక్కడికి వచ్చేలోపే సుబ్బయ్య కారులో పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలించారు. మంగళవారం ఉదయం రేణిగుంట చెక్‌పోస్ట్‌ కూడలి వద్ద సుబ్బయ్యను అరెస్ట్‌ చేసినట్లు సీఐ చెప్పారు. సమావేశంలో ఎస్‌ఐ ఈశ్వరయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

వివాహితపై అఘాయిత్యానికి యత్నించి కటకటాలుపాలైన శ్రీకాళహస్తికి చెందిన సుబ్బ య్య టీడీపీ నేత అనుచరుడు. పదేళ్ల కిందట ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తున్న సుబ్బ య్య తనకు మంత్ర శక్తులు తెలుసునని స్థాని కులను నమ్మించి శ్రీకాళహస్తిలోని బహుదూరుపేటలో మంగళ, శుక్ర, ఆదివారాల్లో తన ఇంటి వద్దే అమ్మవారికి పూజలు చేసి తాయత్తులు కడుతూ గుంజుకునే వాడు.

ఎస్టీ సెల్‌లో కీలక పదవి
మాసారపు సుబ్బయ్య టీడీపీ తిరుపతి జిల్లా ఎస్టీ సెల్‌ అధ్యక్ష పదవిలో కొనసాగుతూ సోషల్‌ మీడియాలో టీడీపీ వాణిని బలంగా వినిపిస్తున్నాడు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డికి నమ్మిన బంటు. అతనిని సుధీర్‌రెడ్డి పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్‌లకు పరిచయం చేసి వారితో ఫొటోలు దిగిన పిరిస్థితి. మాంత్రికుడు మహిళలకు మాయమాటలు చెప్పి వశపరుచుకునేవాడనే ఆరోపణలున్నాయి. అయితే తన వెనుక రాజకీయ అండ ఉండడంతో అతని ఆకృత్యాలను బయటపెట్టేందుకు ఎవ్వరూ సాహసించలేదు.

బొజ్జల సుధీర్‌ కోసం తాంత్రిక పూజలు
టీడీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జి బొజ్జల సుధీర్‌రెడ్డికి ఇతనితో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ కోవలోనే ఆయన రాజకీయ భవిష్యత్తు బాగుండాలని ప్రతివారం శ్రీకాళహస్తి స్వర్ణముఖీ నదిలో దిగంబరంగా సుబ్బయ్య తాంత్రిక పూజలు చేసి నరబలులు కూడా ఇచ్చాడనే ఆరోపణలున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement